ఒకటి కాదు- రెండు దెయ్యాలు
అభినేత్రి+2 ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్..

అభినేత్రి+2 ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్..
ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్.. ప్రభుదేవా, మిల్కీబ్యూటీ తమన్నా, నందితా శ్వేత ప్రధాన తారాగణంగా, విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లర్ మూవీ.. అభినేత్రి+2.. ఇదే కాంబినేషన్‌లో గతంలో వచ్చిన అభినేత్రి సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. రీసెంట్‌గా ఫస్ట్ లుక్ టీజర్ పేరుతో ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. ఫస్ట్ పార్ట్‌లానే సెకండ్ పార్ట్‌లోనూ ఆడియన్స్‌ని థ్రిల్ చెయ్యబోతున్నామని ఈ టీజర్ ద్వారా హింట్ ఇచ్చాడు డైరెక్టర్.. ప్రభుదేవా, తమన్నాతోపాటు, నందితా శ్వేతతోనూ రొమాన్స్ చేసాడు.
కోవై సరళ, సోనూసూద్, అజ్మల్, సప్తగిరి ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. మే 1 న అభినేత్రి+2 తెలుగు, తమిళ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. టీజర్‌లో అయానంకబోస్ విజువల్స్, శ్యామ్ సిఎస్ మ్యూజిక్ బాగున్నాయి. ఈ సినిమాకి ఎడిటింగ్ : ఆంటొనీ, డైలాగ్స్ : సత్య, లిరిక్స్ : వనమాలి, కొరియోగ్రఫీ : పరేష్ శిరోద్కర్, ఫైట్స్ : స్టంట్ సెల్వ, మనోహర్ వర్మ, నిర్మాతలు : అభిషేక్ నామా, ఆర్.రవీంద్రన్.
వాచ్ ఫస్ట్ లుక్ టీజర్..