Mumbai : లగ్జరీ అపార్ట్ మెంట్‌ను అమ్మేసిన అభిషేక్ బచ్చన్!
ముంబైలోని ఒబెరాయ్ 360 పడమరలో అభిషేక్ బచ్చన్ కు ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ ఉంది. 37వ అంతస్తులో 7 వేల 527 చదరపు అడుగుల విస్తీరణం కలిగి ఉంది. 2014 సంవత్సరంలో రూ. 41 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Abishek
Abhishek Bachchan : సినిమాలకు సంబంధించిన వారి విషయం ఏదైనా హాట్ టాపిక్ అవుతుంది. వార్తలు, వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ఫలానా హీరో..ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారని, హీరోయిన్ జిమ్ లో వర్కవుట్ ఇలా…వారికి సంబంధించిన ప్రతీ విషయం..వైరల్ గా మారుతుంటాయనే సంగతి తెలిసిందే. తాజాగా…బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ కు సంబంధించిన లగ్జరీ అపార్ట్ మెంట్ వేరేవారికి అమ్మేశారనే వార్త హల్ చల్ చేస్తోంది.
Read More : Gold Loan : గోల్డ్ లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్
ముంబైలోని ఒబెరాయ్ 360 పడమరలో అభిషేక్ బచ్చన్ కు ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ ఉంది. 37వ అంతస్తులో 7 వేల 527 చదరపు అడుగుల విస్తీరణం కలిగి ఉంది. 2014 సంవత్సరంలో రూ. 41 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నివాసాన్ని అమ్మేయడం ద్వారా రూ. 45.75 కోట్లు వచ్చినట్లు మనీ కంట్రోల్ నివేదిక వెల్లడించిందని సమాచారం. ఇదే బిల్డింగ్ లో పలువురు హీరోలు, హీరోయిన్లు కూడా ప్లాట్ లను కొనుగోలు చేశారు. షాహిద్ రూ. 56 కోట్లు, అక్షయ్ రూ. 52.5 కోట్లు, రాణి ముఖర్జీ (రూ. 7.12 కోట్లు), దిశా పటానీ (రూ.5.95 కోట్లు) ఖార్ వెసట్ పరిసరాల్లో సముద్రముఖంగా ఉన్న నివాసాలను కొనుగోలు చేశారు.
Read More : Meera Mitun: లొంగితేనే ఇతర రాష్ట్రాలవారికి సినీ అవకాశాలు
ఇక..అభిషేక్ బచ్చన్…విషయానికి వస్తే…నిమ్రత్ కౌర్ తో ‘దాస్వి’, చిత్రాంగద సేన్ తో ‘బాబ్ బిశ్వాస్’ సినిమాల్లో నటించారు. ఇవి రిలీజ్ కావాల్సి ఉంది. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ది బిగ్ బుల్’లో అభిషేక్ చివరిసారిగా కనిపించారు.