Arjun : సీఎం అయ్యాక విజయ్‌ని కలిసాను.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ పై స్పందించిన యాక్షన్ కింగ్..
యాక్షన్ కింగ్ అర్జున్ కి ఓ ఈవెంట్లో.. మీరు పాలిటిక్స్ లోకి వెళ్తారా? పార్టీ పెడతారా అనే ప్రశ్న ఎదురయింది. (Arjun)
Arjun
Arjun : ఇటీవల స్టార్ హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. దీంతో సీనియర్ సినిమా స్టార్స్ అందరికి పాలిటిక్స్ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో యాక్షన్ కింగ్ అర్జున్ కి ఓ ఈవెంట్లో.. మీరు పాలిటిక్స్ లోకి వెళ్తారా? పార్టీ పెడతారా అనే ప్రశ్న ఎదురయింది.
దీనికి అర్జున్ సర్జా సమాధానమిస్తూ.. రాజకీయాల్లోకి వెళ్లాలంటే ఆ తపన ఉండాలి. కానీ నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా మంచి చేయాలి. దానికి రాజకీయాలు అవసరం లేదు. అయినా రాజకీయాల్లోకి వెళ్లేంత డబ్బు నా దగ్గర లేదు. ఇప్పుడు రాజకీయం అంతా డబ్బు చుట్టే తిరుగుతుంది అని అన్నారు.
Also Read : Anchor Sreemukhi : సమంత మా ఇంటి బంగారం కోసం.. ముస్తాబయిన శ్రీముఖి.. ఫొటోలు..
దీంతో విజయ్ డబ్బులు ఖర్చుపెట్టకుండానే సీఎం అయ్యాడుగా అని అడిగారు. అలాగే విజయ్ తో ఉన్న అనుబంధం గురించి చెప్పమనడంతో అర్జున్ మాట్లాడుతూ.. విజయ్ డబ్బు ఖర్చుపెట్టలేదు కానీ విజయ్ కు ఉన్నంత పేరు నాకు లేదు. విజయ్ సీఎం అయ్యాక ఒకే ఒక్కడు సినిమా క్లిప్స్ ని వైరల్ చేస్తున్నారు. ఇటీవలే విజయ్ సీఎం అయ్యాక నేను కూడా కలిసాను. విజయ్ కూడా తొలిసారి సీఎం కుర్చీ చూసినప్పుడు ఒకే ఒక్కడు సినిమా గుర్తొచ్చింది, ఆ సినిమా నుంచి చాలా క్లిప్స్, మీమ్స్ నాకు కూడా వచ్చాయని చెప్పారు నాతో. నాతోటి హీరో, నాతో కలిసి పనిచేసిన హీరో ఇప్పుడు సీఎం అయ్యారు అంటే గర్వంగా ఉంది అని అన్నారు.
