Bellamkonda Sreenivas: సీఎం రేవంత్ రెడ్డికి పెళ్లి పత్రిక అందజేసిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఫోటోలు వైరల్
కుటుంబంతో కలిసి వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తన పెళ్ళికి ఆహ్వానించిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas).
Actor Bellamkonda Srinivas invites CM Revanth Reddy to his wedding with kavya reddy
- సీఎం రేవంత్ రెడ్డికి పెళ్లి పిలుపు.
- కుటుంబంతో కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్.
- వైరల్ అవుతున్న వివాహ ఆహ్వాన ఫోటోలు.
Bellamkonda Sreenivas: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తన వివాహానికి రావాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయి శ్రీనివాస్‌తో పాటు ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, తల్లి మరియు సోదరుడు బెల్లంకొండ గణేష్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఈ కుటుంబం, వివాహానికి సంబంధించిన వివరాలను ఆయనతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాబోయే జంటకు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
Ashu reddy: రూ.9 కోట్ల మోసం.. స్పందించిన అషు రెడ్డి.. తప్పుడు వార్తలు రాస్తే జైలుకే అంటూ వార్నింగ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sreenivas) తన ప్రేయసి కావ్యారెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం వైభవంగా జరగగా, ఏప్రిల్ 29న తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో వీరి వివాహం వేడుకగా జరగనుంది. కేవలం రాజకీయ ప్రముఖులనే కాకుండా, చిత్ర పరిశ్రమలోని పెద్దలను కూడా ఈ వివాహానికి శ్రీనివాస్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునను కూడా కలిసి శుభలేఖను అందజేశారు. కొడుకు పెళ్లిని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపించేందుకు బెల్లంకొండ సురేష్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
