Mahesh Babu – Actor Chinna : మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా మురారి. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు, సోనాలి బింద్రే జంటగా తెరకెక్కిన మురారి సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి ఈ సినిమాని, సాంగ్స్ ని ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు. అలాంటి క్లాసిక్ హిట్ మురారి ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజున రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో మహేష్ అభిమానులంతా ఈ సినిమాని థియేటర్లో చూడటానికి ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో దీనికి కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. మురారి సినిమాకి పనిచేసిన వాళ్లలో కొంతమందిని ఇంటర్వ్యూలు చేసి అప్పటి జ్ఞాపకాలని గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు చిన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో మురారి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటన తెలిపారు.
Also Read : Samantha : వాట్.. ఆ సిరీస్‌కి సమంత అంత రెమ్యునరేషన్ తీసుకుందా? ఫస్ట్ సౌత్ హీరోయిన్‌గా రికార్డ్..?
సీనియర్ నటుడు చిన్నా మాట్లాడుతూ.. మురారి సినిమా 50 రోజులు అవుట్ డోర్ రామచంద్రపురంలో షూటింగ్ జరిగింది. షూట్ లో అందరికి ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుంది. అయితే నాకు ప్రొడక్షన్ ఫుడ్ పడదు. షూట్ లో ఉంటే నాకు ఇంటి నుంచి బాక్స్ వచ్చేది. అవుట్ డోర్ లో ఉండటంతో కుదరదు. ఒక రెండు రోజులు ఏదో అడ్జస్ట్ అయ్యాను కానీ నా వాళ్ళ కాలేదు. అప్పటికే నాకు కృష్ణ గారి ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి. మురారి షూటింగ్ లో మహేష్ గారికి నిర్మాత చెల్లెలి వాళ్ళు అక్కడే రామచంద్రాపురంలో ఉండటంతో అక్కడి నుంచి ఫుడ్ ఇంటి భోజనం వచ్చేది. దాంతో నేను ఒకరోజు మహేష్ దగ్గరికి వెళ్లి నేను బయటి ఫుడ్ తినలేను అని నా సమస్య చెప్పి ఏమనుకోకపోతే మీ ఫుడ్ పెడతారా అని సిగ్గు లేకుండా అడిగాను. దానికి ఆయన దానికేముంది వచ్చి తినండి అన్నారు. నాతో పాటు శివాజీరాజా కూడా వచ్చేవాడు. అలా రోజు మధ్యాహ్నం లంచ్ టైంలో మహేష్ దగ్గరికి వెళ్లి తినేవాళ్ళం. కొన్ని రోజులకు మాకు లంచ్ బ్రేక్ ఇచ్చినా మహేష్ కి ఇంకా ఇవ్వకపోవడంతో లేట్ అయ్యేది. ఒకరోజు ఆయనే మీరు తినేయండి నేను వస్తాను అన్నారు. అప్పట్నుంచి మేము ముందు వెళ్లి మహేష్ కోసం తెచ్చిన ఫుడ్ ని తినేసి మిగిలింది అక్కడే పెట్టేస్తే ఆయన తినేవాళ్లు. 50 రోజులు అలాగే తిన్నాం. మహేష్ అంత బాగా చూసుకున్నాడు అని తెలిపారు. దీంతో మహేష్ మంచితనాన్ని మరోసారి పొగుడుతున్నారు అభిమానులు.