×
Ad

Dharma Mahesh : కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసిన హీరో.. మీ పేరులో ఈ లెటర్ ఉందా అయితే స్పెషల్ ఆఫర్ మీకే..

ధర్మ మహేష్ జిస్మత్ మండీ రెస్టారెంట్స్ ని మొదలుపెట్టాడు. (Dharma Mahesh)

Dharma Mahesh

Dharma Mahesh : సినిమా హీరో, హీరోయిన్స్ బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడతారని తెలిసిందే. ఇటీవల చాలా మంది ఫుడ్ బిజినెస్ లు మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలోనే సింధూరం, డ్రింకర్ సాయి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మ మహేష్ జిస్మత్ మండీ రెస్టారెంట్స్ ని మొదలుపెట్టాడు. కొన్నాళ్ల క్రితం ధర్మ మహేష్ తన భార్యతో ఉన్న వివాదంతో వైరల్ అయ్యాడు. (Dharma Mahesh)

తనకున్న ‘Gismat’ రెస్టారెంట్స్ ని తన కొడుకు జగద్వజ పేరు మీదకు మారుస్తూ తన కొడుకు పేరులోని ఫస్ట్ లెటర్ ని పెట్టి ‘Jismat’ గా తన రెస్టారెంట్స్ పేర్లు మార్చాడు. ఇటీవల అమీర్‌పేట్‌లో ఓ రెస్టారెంట్ ని ప్రారంభించగా తాజగా చైతన్యపురిలో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసాడు. ఈ సందర్భంగా తన రెస్టారెంట్ కి వచ్చేవాళ్లకు స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు ఈ హీరో.

Also Read : Pawan Kalyan : స్కూల్ పిల్లలతో పవన్.. పవర్ స్టార్ పక్కనుండటంతో పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి.. ఫోటోలు వైరల్..

తన కొడుకు జగద్వజ లాగే ఎవరి పేరు అయినా J తో స్టార్ట్ అయితే వాళ్లకు మినీ చికెన్ మండీ ఫ్రీగా ఇస్తారట. ఈ ఆఫర్ కేవలం కొద్దీ రోజులు మాత్రమేనట. అందుకు మీ పేరు ఉన్న ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ప్రకటిస్తూ హీరో ధర్మ మహేష్ మాట్లాడుతూ.. తన కుమారుడు జగద్వాజపై ఉన్న ప్రేమతో గిస్మత్ మండీ జిస్మత్ మండీ గా మారుస్తున్నామని తెలిపాడు. అలాగే ఈ రెస్టారెంట్స్ కంపెనీ యొక్క మొత్తం యాజమాన్యాన్ని తన కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తున్నాడు మహేష్.