Viral Video : వీధిలో కుప్పకూలిన వ్యక్తికి CPR చేసి కాపాడిన నటుడు

అకస్మాత్తుగా రోడ్డుపై ఎవరైనా గుండెపోటుతో కుప్పకూలిపోతే వారికి సీపీఆర్ అందించగలిగితే ప్రాణాలతో బయటపడతారు. ముంబయి వీధిలో పడిపోయిన ఓ వ్యక్తికి సమయానికి సీపీఆర్ చేసి ఓ నటుడు మానవత్వం చాటుకున్నాడు.

Viral Video : ఇటీవల కాలంలో ఎక్సర్ సైజ్‌లు చేస్తూ, డ్యాన్సులు చేస్తూ.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారు సైతం అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుతో చనిపోతున్నారు. సరైన టైంలో వారికి CPR (కార్డియో పల్మోనరీ రిససిటేషన్) అందించగలిగితే ప్రాణాలు కాపాడవచ్చు. రోడ్డుపై కుప్పకూలిన ఓ వ్యక్తికి నటుడు గుర్మీత్ చౌదరి సీపీఆర్ అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

London : ఒకేరోజు ఆరుసార్లు ఆగి కొట్టుకున్న విద్యార్ధి గుండె, డాక్టర్ చదవాలనుకుని నిర్ణయించుకున్న బాధితుడు

టీవీ, సినీ నటుడు గుర్మీత్ చౌదర్ ముంబయి వీధిలో కుప్పకూలిన వ్యక్తికి CPR అందించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. గుర్మీత్ చౌదరిని అందరు ప్రశంసిస్తున్నారు. గుర్మీత్ సీపీఆర్ అందించడంతో పాటు స్ట్రెచర్ పైకి తీసుకెళ్లడానికి కూడా సాయం చేసారు. వీడియో చూసిన నెటిజన్లు మానవత్వం ఉన్న నటుడు అని.. రియల్ హీరో అంటూ కామెంట్లు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Hyderabad : గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్ కమిషనర్

గుర్మీత్ చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన లైఫ్‌కి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల గుర్మీత్ భార్య దేవీనా బోనర్జీతో కలిసి గణేశ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు