London : ఒకేరోజు ఆరుసార్లు ఆగి కొట్టుకున్న విద్యార్ధి గుండె, డాక్టర్ చదవాలనుకుని నిర్ణయించుకున్న బాధితుడు

ఒకే రోజున ఆరుసార్లు ఆగిపోయిన గుండె డాక్టర్ల చికిత్సతో తిరిగి కొట్టుకుంది.

London : ఒకేరోజు ఆరుసార్లు ఆగి కొట్టుకున్న విద్యార్ధి గుండె, డాక్టర్ చదవాలనుకుని నిర్ణయించుకున్న బాధితుడు

Indian American Student Atul Rao

Student Atul Rao Heart Stopped six Times : ఓ విద్యార్ధి గుండె ఆగిపోయింది. అలా ఒకసారి కాదు ఆరుసార్లు ఆగిపోయింది.అదేంటీ గుండె ఆరుసార్లు ఆగిపోవటమేంటి..? అనే అనుమానం వచ్చే తీరుతుంది. కానీ అదే గొప్ప వింత. గుండె ఆగి పోవటం తిరిగి కొట్టుకోవటం మళ్లీ ఆగిపోవటం జరిగింది. కానీ డాక్టర్లు చేసిన చికిత్సతో బతికి బయటపడ్డాడా విద్యార్ధి. ఇది నిజంగా వైద్యరంగంలో అద్భుతమనే చెప్పాలి. ఒకే రోజున ఆరుసార్లు ఆగిపోయిన గుండె డాక్టర్ల చికిత్సతో తిరిగి కొట్టుకుంది. ఈ అద్భుతమైన ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.

భారతీయ అమెరికన్ అయిన అతుల్ రావ్ యూకేలో చదువుకోవానికి వెళ్లాడు. అతుల్ లండన్ లో ప్రీ మెడ్‌ డిగ్రీ  చదువుతున్నాడు. ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు.  అతుల్ పల్మనరీ ఎంబోలిజం (Pulmonary Embolism) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ సమస్య వల్ల రక్తం సరఫరా కాక గుండె ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అతనికి అదే జరిగింది. బ్లడ్ సర్య్కులేషన్ జరగక కార్డియాక్ అరెస్ట్‌ పరిస్థితి ఏర్పడింది. దీంతో అతను జూలై 27న కుప్పకూలిపోయాడు. దీంతో  తోటి విద్యార్ధులు లండన్ లోని UK యొక్క నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) కు తరలించారు. అతనిని పరిశీలించి పలు స్కానింగ్ గులు చేయగా డాక్టర్లకు విషయం అర్థమైంది.

Skydiving : 104 ఏళ్ల మహిళ పెద్ద సాహసం.. విమానం నుంచి దూకి స్కైడైవింగ్

ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకడుతుండటంతో హృదయానికి రక్తం సరఫరాలో ఆటంకం కలుగుతోందని, దానివల్లనే గుండె పోటుకు దారి తీస్తున్నట్టు గుర్తించారు. ఆ పరిస్థితిలో ఉన్న అతుల్ 24 గంటల సమయంలో గుండె ఆరుసార్లు ఆగిపోయిందని గుర్తించారు. రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి తగిన మెడిసిన్స్ అందించారు. అలా పలువురు నిపుణుల పర్యవేక్షణలో సర్జరీ చేశారు. ఆస్పత్రి డాక్టర్లు అందరు అతను కోలుకోవటానికి రాత్రి అంతా శ్రమించారు. వారి కష్టం ఫలించింది.అతుల్ కోలుకున్నాడు.

అతుల్ ప్రాణాలతో బయటపడటంతో అతని కుటుంబ సభ్యుల ఆనందం అంతా ఇంతాకాదు. పూర్తిగా కోలుకున్న తరువాత తల్లిదండ్రులతో సహా వెళ్లి  ఆస్పత్రి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.  తనకు జరిగిన ఈపరిస్థితి తరువాత అతుల్ మాట్లాడుతు..తాను మెడిసిన్ చేయటం సరైనదేనా..? కాదా..? అని ఇప్పటి వరకు డైలమాలో ఉన్నానని..కానీ ఇప్పుడు తాను పూర్తిగా డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. గతంలో తాను డిగ్రీ పూర్తి అయ్యాక వ్యాపారంలో స్థిరపడాలని అనుకున్నానని కానీ డాక్టర్లు తనకు తిరిగి ప్రాణం పోశారు. ఇది చాలా అద్భుతం..అటువంటి వైద్య వృత్తిని చేపట్టాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.