Skydiving : 104 ఏళ్ల మహిళ పెద్ద సాహసం.. విమానం నుంచి దూకి స్కైడైవింగ్

స్కైడైవింగ్ అనుభవంగా చాలా సరదాగా సాగిందని మహిళ చెబుతున్నారు. పారాచూట్ తో కిందకు దిగడం కూల్ గా, అద్భుతంగా అనిపించిందని ఆమె సంతోషంగా చెప్పారు.

Skydiving : 104 ఏళ్ల మహిళ పెద్ద సాహసం.. విమానం నుంచి దూకి స్కైడైవింగ్

old woman skydiving

Old Woman Skydiving : అమెరికాలో ఓ 104 ఏళ్ల వృద్ధురాలు పెద్ద సాహసమే చేశారు. ఏకంగా విమానం నుంచి దూకి స్కైడైవ్ చేశారు. చికాగోకు చెందిన డరోతీ హాఫ్నర్(104) విమానం నుంచి స్కైడైవ్ చేసిన అత్యంత వృద్ధ మహిళాగా రికార్డు సృష్టించింది. ఈ ఘటనకు సబంధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ పరిశీలన ప్రక్రియ పెండింగ్ లో ఉంది. ఈ వృద్ధురాలి స్కైడైవింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ క్లిప్ లో స్కైడైవ్ చేసేందుకు వృద్ధ మహిళ తన వాకర్ ను పక్కన పెడుతుండటం కనిపిస్తోంది. ఆపై విమానంలో ఎంట్రీ ఇచ్చి గుండెల నిండా ఆత్మ విశ్వాసంతో స్కైవింగ్ కు పూనుకోవడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని వృద్ధురాలు చాటి చెప్పారు. వయసు శరీరానికే కానీ మనోధైర్యం, సంకల్పం ముందు అది చిన్నబోతుందని స్పష్టం చేసింది.

VRO Meena : ఆమె గట్స్‌కి హ్యాట్సాఫ్.. 10నెలల పసిబిడ్డతో VRO సాహసం, వెంటాడి మరీ మట్టి మాఫియాను అడ్డుకున్న వైనం

స్కైడైవింగ్ అనుభవంగా చాలా సరదాగా సాగిందని మహిళ చెబుతున్నారు. పారాచూట్ తో కిందకు దిగడం కూల్ గా, అద్భుతంగా అనిపించిందని ఆమె సంతోషంగా చెప్పారు. స్కైడైవింగ్ రికార్డును హాఫ్నర్ తిరగరాసిన వీడియోను స్కైడైవ్ చికాగో నెట్ లో అప్ లోడ్ చేశారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన స్కైడైవర్ అయ్యేందుకు హాఫ్నర్ సహకరించడం మరపురాని విషయమని ఆమె వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.