VRO Meena : ఆమె గట్స్‌కి హ్యాట్సాఫ్.. 10నెలల పసిబిడ్డతో VRO సాహసం, వెంటాడి మరీ మట్టి మాఫియాను అడ్డుకున్న వైనం

VRO Meena : తన 10 నెలల పసిబిడ్డను నడుముకి కట్టుకుని స్కూటీతో లారీలని చేజ్ చేసి అడ్డగించి సీజ్ చేశారు.

VRO Meena : ఆమె గట్స్‌కి హ్యాట్సాఫ్.. 10నెలల పసిబిడ్డతో VRO సాహసం, వెంటాడి మరీ మట్టి మాఫియాను అడ్డుకున్న వైనం

VRO Meena (Photo : Google)

VRO Meena – Sand Mafia : కృష్ణా జిల్లా పామర్రు మండలం పెద్ద మద్దాలికి చెందిన VRO మీనా తన 10 నెలల పసిబిడ్డతో సాహసం చేశారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని సాహసోపేతంగా అడ్డుకున్నారు. మట్టిని తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న మీనా.. ఒక్క సెకను కూడా ఆలోచించకుండా తన 10 నెలల పసిబిడ్డను నడుముకి కట్టుకుని స్కూటీతో లారీలని చేజ్ చేసి అడ్డగించి సీజ్ చేశారు. ఫైన్ కట్టిన తర్వాత లారీలను విడిచిపెట్టారు. VRO మీనా సాహసంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

పామర్రు మండలం పసుమర్రు పరిధిలో అనుమతులు లేకుండా మట్టి దిబ్బల నుంచి మట్టిని తవ్వి లారీల్లో తరలిస్తున్నారనే విషయం వీఆర్ఓ మీనాకు తెలిసింది. ఆమె వెంటనే తన బిడ్డను ఎత్తుకుని స్పాట్ కి వెళ్లారు. అక్రమ మైనింగ్ మాఫియాను అడ్డుకున్నారు.

Also Read..AP Politics: రావివారిపాలెం మర్డర్ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే స్వామి హాట్ కామెంట్స్

పసుమర్రులో అక్రమ మైనింగ్ జరుగుతోందని స్థానిక వీఆర్ఓ సమాచారం ఇవ్వగా.. తన పరిధిలోని కొత్తూరులో రెండు వాహనాలను సీజ్ చేశారు మీనా. మైనింగ్ మాఫియాను ఎంతో ధైర్యంగా అడ్డుకోవడమే కాకుండా.. అపరాధ రుసుము కూడా కట్టించేలా చేసిన పెద్దమద్దాలి వీఆర్వో మీనాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. డ్యూటీ పట్ల ఆమెకున్న నిబద్ధతకు, ఆమె గట్స్ కు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. తన డ్యూటీని సక్రమంగా నిర్వహించిన మీనాని అభినందిస్తున్నారు.

మైనింగ్ మాఫియా అంటే చాలా డేంజర్. జాలి, దయ ఏమాత్రం ఉండవు. వారిని అడ్డుకోవాలని చూస్తే చంపేందుకు కూడా వెనుకాడరు. అయినా, వీఆర్ఓ మీనా అస్సలు భయపడలేదు. వెనుకడగు వేయలేదు. అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు అనే సమాచారం అందిన వెంటనే డ్యూటీలోకి దిగిపోయారు. తన పసిబిడ్డను చూసుకునే వారు ఎవరూ లేకపోవడంతో.. బిడ్డను తన నడుముకి చుట్టుకున్నారు.

Also Read..YS Viveka Case: నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు అనుమతి ఇచ్చిన సీబీఐ కోర్టు

తన స్కూటీపైనే బయలుదేరారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను చేజ్ చేశారు. ఆ వాహనాలకు తన స్కూటీని అడ్డంగా పెట్టారు. వారితో జరిమానా కట్టించారు. ఆ తర్వాత ఆ రెండు లారీలను వదిలిపెట్టారు. ఒంట్లో చంటి బిడ్డతో ఎంతో ధైర్యంగా మట్టి మాఫియాను అడ్డుకున్న వీఆర్వో మీనా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ మహిళా అధికారి ధైర్య సాహసాలకు అంతా ఫిదా అవుతున్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధత, డ్యూటీ పట్ల ఉన్న అంకితభావం, అసమాన ధైర్య సాహసాలతో వీఆర్ఓ మీనా అందరికీ ఆదర్శంగా నిలిచారు. విధి నిర్వహణ పట్ల ఆమెకున్న కమిట్ మెంట్ ను అంతా అభినందిస్తున్నారు.