AP Politics: రావివారిపాలెం మర్డర్ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే స్వామి హాట్ కామెంట్స్

దీనిపై మా పార్టీ అధినేత చంద్రబాబు కోరిన విదంగా కేంధ్ర దర్యాప్తు సంస్థతో నిస్పక్షపాతంగా విచారన చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. మీ దర్యాప్తు పై మాకు నమ్మకం లేదు. చంపిన తర్వాత నిందితుడి కుటుంబ సభ్యులు మృతురాలి కూతురిపై దాడి చేసి నిందితున్ని పారిపొమ్మని చెప్పగా ఆ విషయాలను మీరు ఎందుకు పరిగనలోకి తీసుకోలేదు?

AP Politics: రావివారిపాలెం మర్డర్ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే స్వామి హాట్ కామెంట్స్

TDP MLA Swamy: టంగుటూరు మండలం రావివారిపాలెంలో జరిగిన హనుమాయమ్మ హత్య ఘటనలో రాజకీయ కోణం లేదని, కుటుంబ కలహాలే కారమంటూ జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఇచ్చిన నివేదిక పూర్తిగా అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు. ఈ హత్యలో కుటుంబ కలహాలు వాస్తవమే కాని ఇందులో నిందితుడు తనకు వైసీపీ పార్టీ అండ ఉందని, మీ అంతు చూస్తానంటూ భాదిత కుటుంభాన్ని హత్యకు ముందు హెచ్చరించినట్లు మృతురాలి భర్త, పిల్లలు చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు.

Wrestlers Meet: కేంద్ర క్రీడా శాఖ మంత్రితో 6గంటలు సమావేశమైన రెజ్లర్లు.. కేంద్రం ముందు 5 డిమాండ్లు

అయితే ఎస్పీ ఆ విషయాలను పరిగణలోకి తీసుకోవడం లేదని, కుటుంబ సభ్యులు చెబుతున్నదాన్ని దృష్టిలో పెట్టుకుని నిందితుడిని అరెస్ట్ చేసి, విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘మీరు నిష్పక్షపాతంగా విచారన చేసినట్లైతే మొన్న టంగుటూరులో టీడీపీ, వైసీపీల మద్య జరిగిన నిరసన ఘటనలలో టీడీపీపై రెండు ఎపైయార్లు నమోదుచేసిన మీరు వైసీపీ నాయకులపై ఒక్క కేసుకూడా ఎందుకు నమోదు చేయలేదు? వైసీపీ నాయకుడు ఇంటి నుంచి కంపినీకి ఎలా పోయాడు? వైసీపీ నాయకున్ని అసలు మీరు నిజంగా హౌజ్ అరెస్ట్ చేశారా, అవాస్తవాలు చెబుతున్నారా?’’ అని స్వామి అన్నారు.

Karimnagar Medical College: వైద్య విద్యలో మరో మైలురాయి చేరుకున్న తెలంగాణ.. కరీంగనర్ మెడికల్ కాలేజీపై మంత్రి హరీష్

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘దీనిపై మా పార్టీ అధినేత చంద్రబాబు కోరిన విదంగా కేంధ్ర దర్యాప్తు సంస్థతో నిస్పక్షపాతంగా విచారన చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. మీ దర్యాప్తు పై మాకు నమ్మకం లేదు. చంపిన తర్వాత నిందితుడి కుటుంబ సభ్యులు మృతురాలి కూతురిపై దాడి చేసి నిందితున్ని పారిపొమ్మని చెప్పగా ఆ విషయాలను మీరు ఎందుకు పరిగనలోకి తీసుకోలేదు? భాదిత కుటుంభసభ్యులు ఆ విషయాలు వెల్లడిస్తుంటే వాళ్లు సీన్లో లేరు. వారి పేర్లు ఎందుకని స్థానిక సీఐ ప్రస్తావిస్తున్నారు? ఇవన్ని చూస్తుంటే ముందస్తు ప్లాన్ తోనే ఈ రాజకీయ హత్య జరిగినట్లు భావిస్తున్నాం’’ అని అన్నారు.