Karimnagar Medical College: వైద్య విద్యలో మరో మైలురాయి చేరుకున్న తెలంగాణ.. కరీంగనర్ మెడికల్ కాలేజీపై మంత్రి హరీష్

తాజా అనుమతితో ఈ ఏడాది రాష్ట్రంలో 9 మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తులు సాధించి దేశ చ‌రిత్ర‌లోనే తెలంగాణ స‌రికొత్త చ‌రిత్ర‌ సృష్టించింది. ఈ ఏడాది నుండి కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజ‌న్న సిరిసిల్ల‌, నిర్మ‌ల్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, క‌రీంన‌గ‌ర్‌లో మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి

Karimnagar Medical College: వైద్య విద్యలో మరో మైలురాయి చేరుకున్న తెలంగాణ.. కరీంగనర్ మెడికల్ కాలేజీపై మంత్రి హరీష్

Harish Rao

Telangana: కరీంన‌గ‌ర్ ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీకి అనుమతి రావడం సంతోషించదగ్గ విషయమని, వైద్య విద్యలో మరో మైలురాయిని తెలంగాణ చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీ స్థాపించాల‌న్న ముఖ్యమంత్రి కేసీఆర్ ల‌క్ష్యంలో ఇది మ‌రో ముంద‌డుగని ఆయన కొనియాడారు.

Wrestlers Meet: కేంద్ర క్రీడా శాఖ మంత్రితో 6గంటలు సమావేశమైన రెజ్లర్లు.. కేంద్రం ముందు 5 డిమాండ్లు

ఈ విషయమై ఆయన బుధవారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘తాజా అనుమతితో ఈ ఏడాది రాష్ట్రంలో 9 మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తులు సాధించి దేశ చ‌రిత్ర‌లోనే తెలంగాణ స‌రికొత్త చ‌రిత్ర‌ సృష్టించింది. ఈ ఏడాది నుండి కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజ‌న్న సిరిసిల్ల‌, నిర్మ‌ల్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, క‌రీంన‌గ‌ర్‌లో మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థుల‌కు 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ఏర్ప‌డే నాటికి ఉన్న మెడిక‌ల్ కాలేజీల సంఖ్య కేవ‌లం ఐదు మాత్రమే. తొమ్మిదేండ్ల‌లోనే సీఎం కేసీఆర్ మార్గ‌నిర్దేశ‌నంలో ఏర్పాటైన మెడిక‌ల్ కాలేజీల సంఖ్య 21. నేడు మెడికల్ కాలేజీల సంఖ్య 26కి చేరుకుంది. జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు చేయ‌డం ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స్పెషాలిటీ సేవ‌లు చేరువ అవడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య చేరువైంది’’ అని అన్నారు.