YS Viveka Case: నిన్‌హైడ్రిన్ పరీక్షకు అనుమతి ఇచ్చిన సీబీఐ కోర్టు
ఆ లేఖను వైఎస్ వివేక ఒత్తిడిలో రాసినట్లు ఇప్పటికే ఢిల్లీ సీఎఫ్‌ఎస్‌ఎల్ తేల్చింది.

YS Vivekananda Reddy (File Photo)
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేక అప్పట్లో రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్షకు సీబీఐ కోర్టు (CBI Court) అనుమతి ఇచ్చింది. వివేకానంద హత్య స్థలిలో అప్పట్లో ఓ లేఖ లభించింది. ఆ లేఖను 2021, ఫిబ్రవరి 11న సీబీఐ అధికారులు సీఎఫ్‌ఎస్‌ఎల్(CFSL)కు పంపారు.
ఆ లేఖను వైఎస్ వివేక ఒత్తిడిలో రాసినట్లు ఇప్పటికే ఢిల్లీ సీఎఫ్‌ఎస్‌ఎల్ తేల్చింది. వివేక రాసిన లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీబీఐ కోరింది. అందుకు నిన్‌హైడ్రిన్ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్ తెలిపింది. అయితే, ఆ పరీక్ష చేస్తే లేఖపై రాతతో పాటు ఇంకు పాడైపోయే అవకాశం ఉందని సీఎఫ్‌ఎస్‌ఎల్ చెప్పింది.
దీంతో కోర్టు అనుమతి కోరారు సీబీఐ అధికారులు. రికార్డుల్లో ఒరిజినల్ లేఖకు బదులుగా కలర్ ఫొటోకాపీని అనుమతించాలని అన్నారు. లేఖపై ఉండే వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. దీంతో నిన్‌హైడ్రిన్ పరీక్షకు కోర్టు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
YS Viveka case: ఆ సత్తా టీడీపీకి ఉంది.. వెన్నతో పెట్టిన విద్య: సజ్జల రామకృష్ణారెడ్డి