Kadambari Kiran : కాదంబరి కిరణ్ ‘మనం సైతం’ సేవలకు అవార్డు..

హైదరాబాద్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కాదంబరి కిరణ్ 'రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు' అందుకున్నారు.

Kadambari Kiran : కాదంబరి కిరణ్ ‘మనం సైతం’ సేవలకు అవార్డు..

Actor Kadambari Kiran Received Rotary Club Excellence Award for Manam Saitham Charity

Updated On : March 5, 2024 / 5:00 PM IST

Kadambari Kiran : సినీ నటుడు కాదంబరి కిరణ్ ఎన్నో గత పదేళ్లుగా సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదల కోసం ‘మనం సైతం'(Manam Saitham) అనే ఫౌండేషన్ స్థాపించి ఎంతోమందికి సహాయాన్ని అందిస్తున్నారు. తాజాగా ఆయన చేస్తున్న సేవలకు అరుదైన గౌరవం దక్కింది.

హైదరాబాద్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కాదంబరి కిరణ్ ‘రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్నారు. FNCCలో జ‌రిగిన రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు వేడుక‌ల్లో కాదంబరి కిరణ్ తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. రోటరీ క్లబ్ అవార్డు అందించి కాదంబ‌రి కిర‌ణ్‌ను సత్కరించారు.

Vasuki Anand : సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస ఆఫర్స్‌తో బిజీ అవుతున్న పవన్ చెల్లెలు..

రోటరీ క్లబ్.. సేవారంగం నుంచి కాదంబ‌రి కిర‌ణ్‌, సినిమారంగం నుంచి జయసుధ, సంగీతం రంగం నుంచి విజిల్ రమణారెడ్డి, వైద్య రంగం నుంచి డాక్ట‌ర్ సాయిపద్మలకు అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో అవార్డు అందుకున్న అనంతరం కాదంబ‌రి కిర‌ణ్ మాట్లాడుతూ.. ఐశ్వర్యం అంటే సాటి మనిషికి తోడుండటం. ఒక‌రికొక‌రం సాయం చేసుకోక‌పోతే మాన‌వ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంది. కరోనా సమయంలో 50 వేల మంది నిస్సాహ‌యుల‌కు మా ఫౌండేషన్ తరపున సాయం అందించాం అని తెలిపారు. అలాగే సపర్య అనాధ, వృద్ధాప్య ఆశ్రమం ప్రారంభించి వారికి సేవ చేసుకోవడంమే నా జీవిత ల‌క్ష్యం. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. మనంసైతం కుటుంబం అండ‌గా ఉంటుందని కాదంబ‌రి కిర‌ణ్ అన్నారు.

Actor Kadambari Kiran Received Rotary Club Excellence Award for Manam Saitham Charity