Vasuki Anand : సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస ఆఫర్స్‌తో బిజీ అవుతున్న పవన్ చెల్లెలు..
వాసుకి ఆనంద్ వరుసగా ఆఫర్స్ కొట్టేస్తుంది.

Actress Vasuki Anand Getting Huge Offers Recently Appears in Vijay Devarakonda Family Star Teaser
Vasuki Anand : తొలిప్రేమ(Tholiprema) సినిమాలో పవన్ కళ్యాణ్(Pavan Kalyan) చెల్లిగా వాసుకి నటించింది. ఆ పాత్రతో ఇంట్లో చెల్లి అంటే ఇలాగే ఉండాలి అని అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత ఆమెకు సినిమా ఆఫర్స్ వచ్చినా మళ్ళీ సినిమాలు చేయలేదు. పవన్ కళ్యాణ్ స్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని వాసుకి సినిమాలకు దూరంగా సెటిలైపోయింది.
కానీ ఆల్మోస్ట్ 25 ఏళ్ళ తర్వాత అన్ని మంచి శకునములే అనే సినిమాలో హీరోకి అక్క పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అంతగా ఆడకపోయినా వాసుకి వరుసగా ఆఫర్స్ కొట్టేస్తుంది. ఆ సినిమా తర్వాత 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ లో మిడిల్ క్లాస్ గృహిణి పాత్రలో, శివాజీకి భార్యగా నటించి మెప్పించింది. తన నటనతో ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించింది. ఇప్పుడు త్వరలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా కనిపించబోతుంది.
Also Read : Jr NTR : బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వకుండానే.. రెండో సినిమా ఓకే చేసిన ఎన్టీఆర్.. YRF స్పై యూనివర్స్‌లో?
తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా టీజర్ విడుదల చేసారు. ఈ టీజర్ లో వాసుకి ఆనంద్ కనిపించి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో కూడా వాసుకి ఆనంద్ ముఖ్య పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తుంది. ఇవే కాకుండా ఇంకో వెబ్ సిరీస్, సినిమా కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి పవన్ చెల్లెలి పాత్రలో వాసుకి ఆనంద్ సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి ఒక్క సినిమాతోనే పాపులర్ అయి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వరుసగా ఆఫర్స్ తో సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అవ్వడం విశేషం.