×
Ad

Varanasi: వారణాసి.. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్.. యావత్ దేశం గర్వపడేలా ఉంటుంది- మహేష్ బాబు

దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. అందరినీ గర్వపడేలా చేస్తాను.

Varanasi: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ పేరుతో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ ఫస్ట్ లుక్‌తో పాటే గ్లింప్స్‌ను సైతం రిలీజ్ చేశారు. రాజమౌళి-మహేశ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో మహేష్ మాట్లాడారు. వారణాసి సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఈ సినిమా చూశాక యావత్ దేశం మనల్ని చూసి గర్వపడేలా ఉంటుందన్నారు.

”చాలా రోజులైపోయింది బయటకు వచ్చి. కొంచెం కొత్తగా ఉంది. కానీ చాలా బాగుంది మనం కలుసుకోవడం మళ్లీ. స్టేజ్ మీదకు సింపుల్ గా నడుచుకుంటూ వస్తాను అని అన్నాను. కానీ కుదరదన్నారు. చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో. పోనీలెండి నా స్టైల్ లో బులుగు చొక్కా వేసుకుని ఈవెంట్ కు వస్తాను అన్నాను. అదీ కుదరదన్నారు. చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారో. కనీసం గుండీలు పెట్టమన్నా. అదీ కుదరదన్నారు.. స్టైల్ అన్నారు.

ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మనలేదు. నెక్ట్స్ అదేనేమో. ఇదంతా మీ కోసమే. మీరంతా ఓపిగ్గా సపోర్ట్ చేసినందకు థ్యాంక్యూ. అప్ డేట్ అప్ డేట్ అని అడిగారుగా. ఎలా ఉంది అప్ డేట్. నాకు కూడా దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది.

నాన్న గారు అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పే ప్రతీ మాట వినేవాడిని.. ఒక్క మాట తప్ప. ఆయన ఎప్పుడూ నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగే వారు. నువ్వు గెటప్స్ లో చాలా బాగుంటావు ఒక సినిమా చేయి అని అడిగే వారు. కానీ ఆయన మాట నేను వినలేదు. ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి.

ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒకరంగా కచెప్పాలంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. అందరినీ గర్వపడేలా చేస్తాను. మరీ ముఖ్యంగా నా డైరెక్టర్ ని. వారణాసి రిలీజ్ అయినప్పుడు యావత్ దేశం మన గురించి గర్వంగా ఫీల్ అవుతుంది. ఇది టైటిల్ అనౌన్స్ మెంట్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా” అని మహేష్ బాబు అన్నారు.

Also Read: రాజమౌళి, మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదే.. ట్రైలర్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే..