Varanasi: Varanasi: రాజమౌళి, మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదే.. ట్రైలర్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే..

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ పేరుతో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించారు.

Varanasi: Varanasi: రాజమౌళి, మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదే.. ట్రైలర్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే..

Updated On : November 15, 2025 / 11:02 PM IST

Varanasi: ఉత్కంఠకు తెర పడింది. టైటిల్ ఏంటో రివీల్ అయ్యింది. దర్శకధీరుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ఖరారైంది. ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ పెట్టారు. అలాగే మహేష్ బాబు క్యారెక్టర్ ను రివీల్ చేశారు రాజమౌళి. రుద్రగా పరిచయం చేశారు. దీనికి సంబంధించి పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారాయన. ఇక గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ బాబు నంది మీద కూర్చున్న లుక్ అదిరిపోయింది. నంది వాహనంపై ఉగ్రరూపంలో మహేష్ కనిపించడం గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

ఈ మూవీలో మహేష్ ఫస్ట్ లుక్‌తో పాటే గ్లింప్స్‌ను సైతం రిలీజ్ చేశారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ పేరుతో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించారు. ఇదే ఈవెంట్‌లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్‌ను 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

సైన్స్, డివోషన్, చరిత్రను మిక్స్ చేస్తూ తీసిన వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 512 CE వారణాసి( కామన్ ఎరా.. క్రీస్తు శకానికి సమానం) నుంచి 2027 CE మీదుగా 7వేల 200 BCE వరకు సంఘటనలను కలుపుతూ ఉన్న దృశ్యాలు మూవీపై అంచనాలు పెంచేశాయి. త్రేతాయుగం, రాముడి ప్రస్తావన ఉండటం ఆసక్తి రేకెత్తించింది.

Also Read: మహేష్ బాబుతో సినిమా.. నాకు చాలా గర్వంగా ఉంది.. అలా అనడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది- గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రాజమౌళి