Actor Manobala : మనోబాల చివరి సినిమా చిరంజీవితోనే.. ఏ మూవీ తెలుసా?

తమిళ స్టార్ కమెడియన్ మనోబాల తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు. ఇక ఆయన నటించిన చివరి సినిమా చిరంజీవితోనే. ఆ సినిమా ఏంటో తెలుసా?

Actor Manobala : తమిళ స్టార్ కమెడియన్ గా తెలుగు వారికీ పరిచయమైన నటుడు ‘మనోబాల’. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈరోజు (మే 3) తుదిశ్వాస విడిచారు. ట్విట్టర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే మనోబాల హఠాన్మరణం వార్త తమిళ పరిశ్రమని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. నటుడిగానే కాదు దర్శకుడిగా, ప్రొడ్యూసర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సీరియల్ యాక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

Actor Manobala : తమిళ్ స్టార్ కమెడియన్స్ మనోబాల, వడివేలు మధ్య ఉన్న గొడవ ఏంటో తెలుసా?

ప్రథంగా తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చిన మనోబాల తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు. రజినీకాంత్ (Rajinikanth), జగపతిబాబు కలిసి నటించిన కథానాయకుడు బై లింగువల్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మనోబాల.. పున్నమి నాగు, గగనం, మనసును మాయ సేయకే, డేగ, ఊపిరి, రాజాధి రాజా, నాయకి, మహానటి, దేవదాస్, రాజ్ దూత్ చిత్రాల్లో నటించారు. చివరిగా చిరంజీవి (Chiranjeevi) బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమాలో నటించారు. ఈ మూవీలో కోర్ట్ లో జడ్జి పాత్రని ఆయన పోషించారు.

Nandi Awards : నంది అవార్డ్స్ పై రచ్చ.. అమరావతిలో భూములు తీసుకున్నారు కదా.. నట్టి కుమార్!

ఇక అసలు నటుడిగా చివరి సినిమా అంటే కాజల్ అగర్వాల్ నటించిన ‘ఘోస్ట్’ మూవీ. మార్చి 17న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. తెలుగులో కూడా డబ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చింది. కాగా మనోబాల తన సినీ కెరీర్ ని స్టార్ డైరెక్టర్ భారతిరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ చేశారు. కమల్ హాసన్ రిఫర్ చేయడంతో భారతిరాజ్ దగ్గర మనోబాలకు అవకాశం వచ్చింది. ఆ తరువాత నటుడిగా వెండితెరకు పరిచయమైన మనోబాల 1982 లో మొదటి సినిమాని డైరెక్ట్ చేశాడు. 20కు పైగా సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.

 

ట్రెండింగ్ వార్తలు