actor manoj bajpyee shocking comments on bollywood pr team
Manoj Bajpayee: బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయీ నోరు జారారు. నేషనల్ క్రష్ ట్యాగ్ ల గురించి, బాలీవుడ్ పీఆర్ టీం ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో, మనోజ్ బాజ్‌పేయీ చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆలాగే, ఈ వ్యాఖ్యలపై రష్మిక మందన్నా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కావాలనే అయన రష్మికను టార్గెట్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Shivaji In Bigg Boss : మళ్ళీ బిగ్ బాస్ లో అడుగుపెట్టిన శివన్న.. కంటెస్టెంట్ గా కాదు..
ఇంతకీ అసలు విషయం ఏంటంటే, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయీ(Manoj Bajpayee) గురించి, ఆయన సినిమాల గురించి, నటన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తనదైన నటనతో లక్షల మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నాడు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బాలీవుడ్ పీఆర్ టీం ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. “పియూశ్ మిశ్రా లాంటి గొప్ప నటులు ఎన్నో రోజులు శిక్షణ, శ్రమ తరువాత ఇండస్ట్రీలో వచ్చారు. అతని తర్వాత వచ్చిన వారిని ఉత్తమ నటులు అంటూ హైలెట్ చేస్తున్నారు. ఇది కచ్చితంగా పియూశ్‌ను అవమానించడమే అవుతుంది. ఇండస్ట్రీలో పరిస్థితులు ఒకప్పటిలాగా లేవు. పూర్తిగా మారిపోయాయి. రాత్రికి రాత్రే ఉత్తమ నటుడు, నేషనల్ క్రష్ ట్యాగ్‌లు ఇచ్చేస్తున్నారు. వారిని వైరల్ చేస్తున్నారు.
ఏదైనా సినిమాలో గొప్పగా నటించామని అనుకునేలోపే పీఆర్ టీమ్ వేరే వారిని హైలైట్ చేస్తుంది. దానివల్ల, వాళ్ళు గుర్తింపు పొందుతున్నారు. ఈ సంస్కృతి చాలా చిరాకుగా అనిపిస్తోంది” అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ కాస్త వైరల్ కావడంతో రష్మిక మందన్నా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఆయన రశ్మికపై కామెంట్స్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.