TTD Stampede : తిరుమ‌ల ఘ‌ట‌న‌పై స్పందించిన మోహ‌న్‌బాబు..

తిరుమ‌ల తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై సినీ న‌టుడు మోహ‌న్ బాబు స్పందించారు.

TTD Stampede : తిరుమ‌ల ఘ‌ట‌న‌పై స్పందించిన మోహ‌న్‌బాబు..

Actor Mohan Babu Responds on Tirupati Stampede Incident and Offers Condolences

Updated On : January 9, 2025 / 12:43 PM IST

Mohan Babu on TTD Stampede: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిస‌లాట జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై సినీ న‌టుడు మోహ‌న్ బాబు స్పందించారు. తిరుమ‌ల ఘ‌ట‌న త‌న హృద‌యాన్ని క‌ల‌చివేసింద‌న్నారు. ఇలా జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నాడు. గాయ‌ప‌డిన భ‌క్తులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

‘తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు టికెట్ల కోసం తిరుపతిలో కౌంటర్ల వద్దకు వెళ్ళి అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొంతమంది మరణించడం నా హృదయాన్ని కలిచివేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకునే జాగ్రత్తలు, సదుపాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అయినా ఇలా జరగడం దురదృష్టకరం. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని మరణించిన వారి కుటుంబాలకు ఆ వైకుంఠవాసుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నాను.’ అని ఎక్స్‌లో మోహ‌న్ బాబు రాసుకొచ్చారు.

Mohan babu : సినీ న‌టుడు మోహ‌న్‌బాబుకు సుప్రీం కోర్టులో ఊర‌ట‌..

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున కేంద్రాల వద్దకు రాగా తొక్కిసలాట చోటు చేసుకుంది.

ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

OG Glimpse : ప‌వ‌న్ అభిమానుల‌కు సంక్రాంతి ట్రీట్‌..! ఓజీ గ్లింప్స్ రెడీ?