Mohan Raj : స్టార్ విలన్ కన్నుమూత.. ED ఆఫీసర్ నుంచి విలన్ గా ప్రయాణం..
సీనియర్ నటుడు, విలన్ క్యారెక్టర్స్ తో ఫేమ్ తెచ్చుకున్న మోహన రాజా నిన్న గురువారం కన్నుమూశారు.

Actor Mohan Raja Aka Keerikkadan Jose Passes away with Health Issues
Mohan Raj : సీనియర్ నటుడు, విలన్ క్యారెక్టర్స్ తో ఫేమ్ తెచ్చుకున్న మోహన రాజా నిన్న గురువారం కన్నుమూశారు. సెంట్రల్ గవర్నమెంట్ ED ఆఫీసర్ గా కెరీర్ మొదలుపెట్టిన మోహన రాజా సినిమాల మీద ఇష్టంతో పరిశ్రమలోకి వచ్చారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆల్మోస్ట్ 300 లకు పైగా సినిమాలు చేసిన మోహన రాజా గత కొన్నాళ్లుగా వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో గత కొన్నాళ్లుగా మోహన రాజా చికిత్స పొందుతూ నిన్న గుండెపోటు రావడంతో మరణించారు. దీంతో మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మలయాళ సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
Also Read : Rajendra prasad Daughter : సినీ పరిశ్రమలో విషాదం.. రాజేంద్రప్రసాద్ కూతురు కన్నుమూత..
మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన మోహన్ రాజా మలయాళంలో 1989లో వచ్చిన కిరీడం అనే సినిమాలో విలన్ పాత్రలో కిరిక్కాడన్ జోస్ గా అదరగొట్టారు. దీంతో అతని స్క్రీన్ పేరు కిరిక్కాడన్ జోస్ గా మారిపోయింది. ఈ సినిమాతో మోహన్ రాజా స్టార్ విలన్ ఆర్టిస్ట్ అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్ గానే నటించారు. మన తెలుగులో లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, చిరాయుడు, స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్, అసెంబ్లీ రౌడీ, మెకానిక్ అల్లుడు, నిప్పు రవ్వ, బొబ్బిలి సింహం, ప్రతినిధి, సోగ్గాడి పెళ్లాం.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.