Rajendra prasad Daughter : సినీ పరిశ్రమలో విషాదం.. రాజేంద్రప్రసాద్ కూతురు కన్నుమూత..

రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Rajendra prasad Daughter : సినీ పరిశ్రమలో విషాదం.. రాజేంద్రప్రసాద్ కూతురు కన్నుమూత..

Actor Rajendra Prasad Daughter Gayatri Passes away with Heart Attack

Updated On : October 5, 2024 / 6:45 AM IST

Rajendra prasad Daughter : నేడు తెల్లవారు జామున సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ కూతురు మరణించారు. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రికి అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

గాయత్రి కూతురు తేజస్విని చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. మహానటి సినిమాలో సావిత్రి చిన్నప్పటి పాత్ర వేసింది రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి కూతురే. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.