Akhil Akkineni :అక్కినేని అఖిల్ పెళ్లైపోయింది.. రిసెప్షన్ ఎప్పుడు అంటే..
హీరో నాగార్జున రెండో కుమారుడు, నటుడు అక్కినేని అఖిల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు.

Akhil Akkineni ties knot with Zainab Ravdjee
హీరో నాగార్జున రెండో కుమారుడు, నటుడు అక్కినేని అఖిల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు జైనబ్ రవ్జీ మెడలో మూడు ముళ్లు వేశారు. జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంటిలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు బ్రహ్మముహూర్తంలో పెళ్లి ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు అత్యంత దగ్గరి సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్-ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్ తదితరులు వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అనంతరం పెళ్లి బరాత్ నిర్వహించగా.. నాగార్జున, నాగచైతన్య తదితరులు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Mahesh – Rajamouli : సమ్మర్ హాలిడేస్ కంప్లీట్.. రాజమౌళి – మహేష్ షూటింగ్ మళ్ళీ ఎప్పట్నించి అంటే..
ఇక జూన్ 8న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.
కాగా.. అఖిల్-జైనబ్‌ల నిశ్చితార్థం గతేడాది నవంబర్‌లో జరిగింది.