యువనటుడు ఉదయ్‌కిరణ్‌ హఠాన్మరణం

యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ (34) కాకినాడలో శుక్రవారం రాత్రి మరణించాడు..

  • Publish Date - February 15, 2020 / 05:40 AM IST

యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ (34) కాకినాడలో శుక్రవారం రాత్రి మరణించాడు..

యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ (34) హఠాన్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో కాకినాడలో గుండెపోటుతో అతడు మరణించాడు. ఉదయ్‌కిరణ్‌ పార్థివ దేహానికి పలువురు రాజకీయ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. ‘పరారే’, ‘ఫ్రెండ్స్‌బుక్’ సినిమాల్లో ఉదయ్‌కిరణ్‌ హీరోగా  నటించాడు.

పలు తమిళ సినిమాల్లోనూ నటించిన ఉదయ్.. పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్నాడు. 2016లో జూబ్లీహిల్స్‌లోని ఓవర్ ద మూన్ పబ్‌లో గొడవ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. తర్వాత మాదాపూర్ దస్‌పల్లా హోటల్‌లో సిబ్బందితో గొడవపడి ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో కేసు నమోదైంది.

విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఉదయ్‌ కిరణ్‌ పలు నేరాలకు పాల్పడినట్టు అప్పట్లో పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులోనూ అరెస్టై జైలు జీవితం గడిపాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కాకినాడలో మహిళను మోసం చేసిన కేసులోనూ అరెస్టయ్యాడు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 59లోని నందగిరిహిల్స్‌లో ఇంటి యాజమానిపై దౌర్జన్యం చేయడంతో అతనిపై 2018లో క్రిమినల్‌ కేసు కూడా పెట్టారు. ఇలా పలువురిని మోసం చేయడంతో అతడిపై పలుమార్లు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఉదయ్‌ కిరణ్‌కు 2016లో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స అందించారు.. తన సొంత తప్పిదాల కారణంగా నిండు జీవితాన్ని, ఉజ్వల భవిష్యత్‌ని చేతులారా పాడుచేసుకున్నాడని ఉదయ్‌తో సన్నిహితంగా మెలిగినవారు చెబుతున్నారు.

Read  More>>అది జగన్ చెప్పాలి.. ఎవరేం మాట్లాడినా పార్టీకి సంబంధం లేదు

ట్రెండింగ్ వార్తలు