Noor Malabika Das : కుళ్లిన స్థితిలో శవమై కనిపించిన కాజోల్ సహనటి.. మృతదేహన్ని చూసేందుకు రాని కుటుంబ సభ్యులు..!
మాజీ ఎయిర్ హోస్టెస్, నటి నూర్ మాళబికా దాస్ అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది.

Noor Malabika Das
Actor Noor Malabika Das : మాజీ ఎయిర్ హోస్టెస్, నటి నూర్ మాళబికా దాస్ అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. ముంబైలోని ఆమె నివసిస్తున్న అపార్టుమెంట్ నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని తలుపు బద్దలు కొట్టి చూడగా కుళ్లిన స్థితిలో ఉన్న నూర్ డెడ్‌బాడీ కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
అసోంకి చెందిన మాళబికా వయసు 32 సంవత్సరాలు. ఆమె తన కెరీర్‌ను ఎయిర్ హోస్టెస్‌గా ప్రారంభించింది. నటనపై ఉండే ఆసక్తితో పలు అడల్ట్ సినిమాల్లో నటించింది. 2023 లీగల్ డ్రామా ‘ది ట్రయల్’లో నటి కాజోల్‌తో కలిసి పనిచేసింది. ఈ సిరీస్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆమె చనిపోవడానికి రెండు వారాల ముందు కుటుంబ సభ్యులు ముంబైలోని నటి నివాసానికి వచ్చి వెళ్లారు.
Balakrishna Fan : బాలయ్య పుట్టిన రోజు.. తిరుమలలో ఏకంగా 664 కొబ్బరికాయలు కొట్టిన అభిమాని..
కాగా.. ఆమె చనిపోయిన తరువాత ఆమె కుటుంబ సభ్యులు కనీసం మృతదేహన్ని చూసేందుకు సైతం రాకపోవడం గమనార్హం. పోలీసులు డెడ్‌బాడీని తీసుకువెళ్లాలని ఫోన్ చేసినా వాళ్లు పట్టించుకోలేదు. దీంతో ఓ ఎన్జీవో సాయంతో ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు.