Balakrishna Fan : బాలయ్య పుట్టిన రోజు.. తిరుమలలో ఏకంగా 664 కొబ్బరికాయలు కొట్టిన అభిమాని..

బాలయ్య వీరాభిమాని ఒకరు తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఏకంగా 664 కొబ్బరికాయలు కొట్టారు.

Balakrishna Fan : బాలయ్య పుట్టిన రోజు.. తిరుమలలో ఏకంగా 664 కొబ్బరికాయలు కొట్టిన అభిమాని..

Balakrishna Fan Sridhar Varma Break 664 Coconuts at Tirumala Venkateswara Swami Temple on Balayya Birthday

Updated On : June 10, 2024 / 12:52 PM IST

Balakrishna Fan : నేడు బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాలయ్య అభిమానులు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇటీవలే బాలయ్య మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టడంతో ఈ సారి సెలబ్రేషన్స్ ని మరింత గ్రాండ్ గా చేస్తున్నారు బాలయ్య అభిమానులు. ఆల్రెడీ ఇవాళ ఉదయం బాలయ్య హిందూపురంలోనే స్పెషల్ పూజలు నిర్వహించి అభిమానులు, కార్యకర్తల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

Also Read : Kalki Trailer Update : ప్రభాస్ కల్కి ట్రైలర్ రిలీజ్ టైం ఎప్పుడంటే.. వైరల్ అవుతున్న కొత్త పోస్టర్..

ఈ క్రమంలో బాలయ్య వీరాభిమాని ఒకరు తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఏకంగా 664 కొబ్బరికాయలు కొట్టారు. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఎన్టీఆర్ రాజు గారి కొడుకు రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ బాలకృష్ణకు వీరాభిమాని. శ్రీధర్ వర్మ నేడు తిరుమల ఫ్యామిలీతో సందర్శించి అనంతరం ఆలయం ముందు అఖిలాండం వద్ద బాలకృష్ణ 64వ పుట్టిన రోజు సందర్బంగా 664 కొబ్బరికాయలు కొట్టి, 5 కిలోల కర్పూరం వెలిగించి బాలయ్య పేరిట పూజలు నిర్వహించారు.

Balakrishna Fan Sridhar Varma Break 664 Coconuts at Tirumala Venkateswara Swami Temple on Balayya Birthday

అనంతరం శ్రీధర్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆరోగ్యంగా ఉండాలి, అయన ఏ పని చేపట్టిన విజయవంతం కావాలని అన్నారు.