Ranbir Kapoor
Ranbir Kapoor ED summon : మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ((ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఇటీవల మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ రూ.417 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
దుబాయ్ కేంద్రంగా..
సౌరభ్ చంద్రఖర్, రవి ఉప్పల్ లు ఛత్తీస్‌గఢ్ చెందిన వారు. ఈ ఇద్దరు మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు. వీరు యూఏఈలోని దుబాయ్ కేంద్రంగా మన(భారత) దేశంలో మహదేవ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే.. బెట్టింగ్ ముగుసులో వీరు మనీలాండరింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. బెట్టింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కోల్‌కతా, భోపాల్, ముంబై వంటి నగరాల్లో ఈడీ సోదాలు నిర్వహించి మొత్తం రూ.417 కోట్లను సీజ్ చేసింది.
వివాహానికి రూ.200 కోట్లు..
మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లో ఒకరు అయిన సౌరభ్ చంద్రకర్ వివాహం ఈ ఏడాది ఫ్రిబ్రరిలో యూఏఈలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి కోసం రూ.200కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి బాలీవుడ్ సెలబ్రెటీలు అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అజ్గర్, విశాల్ దద్లానీ, టైగర్ ష్రాఫ్, నేహా కక్కర్, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, సన్నీ లియోన్, భాగ్యశ్రీ, పుల్కిత్, కీర్తి ఖబండా, నుష్రత్ భారుచా, కృష్ణ అభిషేక్ తదితరులు హాజరు అయినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఈ పెళ్లికి హాజరైన నటులపై ఈడీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు నోటీసులు జారీ అయ్యాయి. మరో 17 మంది నటులకు త్వరలోనే ఈడీ నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Mansion 24 Trailer : భయపెట్టడానికి వస్తున్న వరలక్ష్మి.. మ్యాన్షన్ 24 గది రహస్యం ఏంటి..?
Actor Ranbir Kapoor summoned by Enforcement Directorate on 6th October, in connection with Mahadev betting app case
(file photo) pic.twitter.com/K8DZhME5RK
— ANI (@ANI) October 4, 2023