నేను బ్లడ్ టెస్టు చేయించుకోను.. హీరోయిన్ సంజన రచ్చ..!

డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్ట్ అయిన కన్నడ భామ హీరోయిన సంజన రచ్చ రచ్చ చేసింది.. బ్లడ్ శాంపిల్ ఇవ్వమని అడిగినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది.. బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. డ్రగ్స్ కేసులో కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..
వీరిలో నటి సంజన ఒకరు. కేసు విచారణలో భాగంగా సంజనాకు బ్లడ్ టెస్టు చేయడానికి బెంగుళూర్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు ప్రయత్నించారు. అందుకు సంజన నిరాకరించింది.. ఆస్పత్రిలో బ్లడ్ శాంపిల్ ఇవ్వనంటూ తెగేసి చెప్పింది. పోలీసులు కూడా ఆమెను కట్టడి చేయలేపోయారు.
డ్రగ్స్ మాఫియా కేసులో తనపై వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని అంటోంది.. మీడియా ముందు నన్ను ఒక బకరాను చేసి ఆడుకుంటు న్నారంటూ సంజన ఆరోపించింది. తాను బ్లడ్ టెస్టు చేయించుకోనంటూ బీస్మించు కూర్చుంది. రక్త పరీక్షలు చేసినా నా రక్తమే అనడానికి గ్యారెంటీ ఏంటి? అని అనుమానం వ్యక్తం చేసింది.
తనకు ఎవరిపై నమ్మకం లేదని బోరున విలపించింది. మరోవైపు నటి రాగిణి, సంజనా డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. నటి సంజనకు బ్లడ్ టెస్టులు చేసేందుకు పోలీసులు ఆమెను ల్యాబ్ తీసుకెళ్లారు. కానీ, బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు సంజనా మొండికేసింది..