Sarath Babu Health: నటుడు శరత్ బాబు హెల్త్ అప్డేట్.. డాక్టర్లు ఏమన్నారంటే..?

నటుడు శరత్ బాబు అనారోగ్యం కారణంగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

Actor Sarath Babu Health Update Given By Doctors

Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న శరత్ బాబు ఆరోగ్యంపై పలు వదంతులు వస్తుండటంతో, ఇటీవల ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్‌ తేజస్‌ స్పందించాడు. శరత్ బాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రస్తుతం ఆయన చికిత్సకు రెస్పాండ్ అవుతున్నట్లుగా ఆయుష్ తేజస్ తెలిపాడు.

Sarath Babu : ఆ వార్తలు నమ్మొద్దు.. శరత్ బాబు సిస్టర్ క్లారిటీ!

అయితే, తాజాగా శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శరత్ బాబు అనారోగ్యంపై అభిమానులు ఎలాంటి వదంతులు నమ్మొద్దని వారు తెలిపారు. శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఏఐజీ ఆసుపత్రి అధికారిక ప్రకటన తప్ప ఇతర వార్తలను ఏమాత్రం నమ్మొద్దని వారు కోరారు. శరత్ బాబు ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Sarath Babu : అత్యంత విషమంగా శరత్‌ బాబు ఆరోగ్యం

ప్రస్తుతం శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉందని.. ఆయన ప్రాణాధారంపై స్థిరంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు అఫీషియల్‌గా అనౌన్స్ చేశాయి. ఇక ఆయన ఆర్గాన్స్ పనితీరు ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధించాలని వారు కోరారు.