Sarath Babu : ఆ వార్తలు నమ్మొద్దు.. శరత్ బాబు సిస్టర్ క్లారిటీ!

టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు చనిపోయాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల పై శరత్ బాబు సిస్టర్ స్పందించారు.

Sarath Babu : ఆ వార్తలు నమ్మొద్దు.. శరత్ బాబు సిస్టర్ క్లారిటీ!

Sarath Babu sister reacts on fake news spreading on social media on him

Updated On : May 3, 2023 / 9:29 PM IST

Sarath Babu : టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ వస్తున్న విషయం తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే ఏప్రిల్ 21 నాడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ (AIG) ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఐసీయూలో అడ్మిట్ చేసుకున్న వైద్యులు మెరుగైన చికిత్స అందించారు.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ షురూ.. యాక్షన్ పార్ట్!

దీంతో ఆరోగ్యం కొంచెం నిలకడ అయ్యినప్పటికీ పూర్తి కోలుకునేందుకు కొంచెం సమయం పడుతుందని తెలియజేశారు. అయితే తాజాగా ఆయన చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని మీడియా వెబ్ సైట్స్ కూడా వార్తలు రాయడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళన చెందారు. దీంతో శరత్ బాబు సిస్టర్ స్పందిస్తూ.. ఆయన చనిపోలేదంటూ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దు అంటూ తెలియజేశారు.

Actor Manobala : మనోబాల కమెడియన్ మాత్రమే కాదు.. రజినీకాంత్‌ని డైరెక్ట్ చేసిన దర్శకుడు కూడా!

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కొంచెం కోలుకుందని, దీంతో ఐసీయూ (ICU) నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశారని ఆమె తెలియజేశారు. త్వరలోనే ఆయన కంప్లీట్ గా కోలుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారు అంటూ అభిమానులకు ధైర్యం చెప్పారు. కాగా శరత్ బాబు 1973లో తెలుగు సినిమా ‘రామరాజ్యం’ తో వెండితెరకు పరిచయం అయ్యాడు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించారు. 200 పైగా సినిమాలో నటించిన శరత్ బాబు.. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆడియన్స్ ని అలరించాడు.