Actor Manobala : మనోబాల కమెడియన్ మాత్రమే కాదు.. రజినీకాంత్‌ని డైరెక్ట్ చేసిన దర్శకుడు కూడా!
మనోబాల కమెడియన్ మాత్రమే కాదు. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. రజినీకాంత్, విక్రమ్ వంటి హీరోలను ఆయన డైరెక్ట్ చేశారు.

Actor Manobala directed movies with Rajinikanth and vikram
Actor Manobala : గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న తమిళ సినీ నటుడు మనోబాల ఈరోజు (మే 3) కన్నుమూశారు. ఆయన మరణ వార్త తమిళ పరిశ్రమని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన మనోబాల కమెడియన్‌గా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ప్రొడ్యూసర్‌గా, సీరియల్ యాక్టర్ గా కూడా కళామతల్లికి సేవలు అందించారు. అంతేకాదు దర్శకుడిగా 20కి పైగా సినిమాలను తెరకెక్కించారు.
Actor Manobala : మనోబాల చివరి సినిమా చిరంజీవితోనే.. ఏ మూవీ తెలుసా?
కమల్ హాసన్ (Kamal Haasan) రిఫర్ చేయడంతో 1979 లో భారతిరాజ్ దగ్గర ‘పుతియా వార్పుగల’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. ఆ తరువాత నటుడిగా పలు సినిమాల్లో నటించిన మనోబాల 1982 లో ‘ఆగాయి గంగై’ అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. దర్శకుడిగా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. అయితే ఆ చిత్రాల్లో కొన్ని సినిమాలను స్టార్ హీరోలతో తెరకెక్కించినవి కూడా ఉన్నాయి. కన్నడ స్టార్ హీరో దివంగత విష్ణువర్ధన్ తో డిసెంబర్ 31 అనే సినిమాని డైరెక్ట్ చేశారు.
Actor Manobala : తమిళ్ స్టార్ కమెడియన్స్ మనోబాల, వడివేలు మధ్య ఉన్న గొడవ ఏంటో తెలుసా?
అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ తో (Rajinikanth) కూడా ఒక సినిమా చేశారు. 1987 లో రజినీకాంత్, రాధికా హీరోహీరోయిన్లుగా ‘ఊర్కవలన్’ అనే యాక్షన్ మూవీని తెరకెక్కించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయనే అందుకుంది. మరో స్టార్ హీరో విక్రమ్ తో (Vikram) కూడా ‘సిరాగుగల్’ అనే సినిమాని డైరెక్ట్ చేశారు. ఇక దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన సినిమా ‘నైనా’. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా 2002 లో రిలీజ్ అయ్యింది.