Sathyaraj: హీరోలను నెత్తిన పెట్టుకొని ఊరేగకండి.. మాకేమీ తెలియదు.. సత్యరాజ్ అన్నది ఎవరి గురించి?

తమిళ నటుడు సత్యరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు(Sathyaraj). ఇటీవల జరిగిన ఒక సంఘటనను ఉద్దేశిస్తూ.. నటులను నెత్తిన పెట్టుకొని ఊరేగడం మానుకోండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Sathyaraj: హీరోలను నెత్తిన పెట్టుకొని ఊరేగకండి.. మాకేమీ తెలియదు.. సత్యరాజ్ అన్నది ఎవరి గురించి?

Actor Sathyaraj made shocking comments on heroes

Updated On : October 5, 2025 / 9:00 AM IST

Sathyaraj: తమిళ నటుడు సత్యరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల జరిగిన ఒక సంఘటనను ఉద్దేశిస్తూ.. నటులను నెత్తిన పెట్టుకొని ఊరేగడం మానుకోండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో, సత్యరాజ్ చేసిన ఈ కామెంట్స్ (Sathyaraj)పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? నటుడు సత్యరాజ్ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని చెప్తూనే ఉంటాడు. ఇందులో భాగంగానే ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.

Rahul Ramakrishna: తప్పు తెలుసుకున్నా.. ఇక నా పని నేను చేసుకుంటా.. వివాదంపై స్పందించిన రాహుల్ రామకృష్ణ

“నటీనటులను తలపై పెట్టుకొని ఊరేగడం మానేయండి. వాళ్లకు చాలా తెలుసని అనుకోకండి. నటించడం మాత్రమే తెలుసు వాళ్ళకి. ఈ సమాజంలో జరుగుతున్న పెద్ద తప్పు ఏంటంటే.. నటులను ఐన్‌ స్టిన్‌ రేంజ్‌లో ఊహించుకోవడమే. వారేమీ పెరియార్‌, అంబేడ్కర్‌ లాంటి గొప్ప వ్యక్తులు కాదు. దర్శకుడు చెప్పింది అనుసరిస్తారు అంతే” అంటూ పోస్టులో రాసుకొచ్చాడు సత్యరాజ్. అయితే, ఈ పోస్టును ఇండైరెక్ట్ గా ఒక హీరోని టార్గెట్ చేసి కావాలని అలా మాట్లాడాడు అంటూ కొంతమంది మండిపడుతున్నారు.

తాజాగా సత్యరాజ్ కామెంట్స్ పై దర్శకుడు పేరరసు తీవ్రంగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. “నటులకు ఏమీ తెలియదనుకుంటే ఎలా. మీరూ కూడా ఒక నటుడే కదా. మీరెందుకు సందేశం ఇస్తున్నారు. ఎంజీఆర్‌ ఉన్నప్పుడు ఇలా అనే ధైర్యం మీకుండేదా? పార్టీ కోసం శ్రమించిన వాళ్ళను పక్కన పెట్టి సత్యరాజ్‌ కూతురికి పదవి ఎందుకు ఇచ్చారని అడగాలి. నటన అనేది వృత్తి మాత్రమే. వారిలో ప్రపంచ జ్ఞానం కల్గినవారు చాలా మంది ఉన్నారు”అంటూ చెప్పుకొచ్చాడు.