అందరు అమ్మాయిలను ఉద్దేశించి నేను మాట్లాడలేదు.. హీరోయిన్లను మాత్రమే.. సారీ: సినీనటుడు శివాజీ

"సినీపరిశ్రమలో మహిళల మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను" అని శివాజీ చెప్పారు.

అందరు అమ్మాయిలను ఉద్దేశించి నేను మాట్లాడలేదు.. హీరోయిన్లను మాత్రమే.. సారీ: సినీనటుడు శివాజీ

Actor Shivaji

Updated On : December 23, 2025 / 6:47 PM IST

Actor Shivaji: హీరోయిన్స్ వేసుకునే దుస్తులపై సినీనటుడు శివాజీ చేసిన కామెంట్స్ దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ శివాజీ వీడియో పోస్ట్ చేశారు.

“హీరోయిన్లు ఈ మధ్య కాలంలో బయట పలుచోట్ల ఇబ్బంది పడ్డందుకు.. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేను నాలుగు మంచి మాటలు చెప్పాలనుకున్నాను. రెండు అన్‌పార్లమెంటరీ వర్డ్స్‌ వాడాను.

నేను మాట్లాడింది అందరు అమ్మాయిలను ఉద్దేశించి కాదు. హీరోయిన్లు బయటికి వెళ్లినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే వారికి ఇబ్బంది ఉండదేమోనన్న ఉద్దేశంతో మాట్లాడాను. ఎవరినీ అవమానపర్చాలని కాదు.

ఏదేమైనా రెండు అన్‌పార్లమెంటరీ వర్డ్స్‌ దొర్లాయి. దానికి క్షమాపణలు చెబుతున్నాను. నేనెప్పుడు స్త్రీ అంటే అమ్మవారిలాగే అనుకుంటాను. ఈ సమజంలో స్త్రీని తక్కువ చేసి చూస్తున్నారు. అలాంటి అవకాశం సమాజానికి ఇవ్వద్దనే ఉద్దేశంతో మాట్లాడాను.

నా ఉద్దేశం మంచిదే కానీ, ఆ రెండు పదాలు దొర్లకుండా ఉంటే బాగుండేది. మంచి చెప్పాలన్న ఉద్దేశమే తప్ప అవమానపర్చాలన్న ఉద్దేశం లేదు. సినీపరిశ్రమలో మహిళల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే, మహిళలు ఎవరైనా బాధపడి ఉంటే నేను క్షమాపణలు చెబుతున్నాను” అని శివాజీ చెప్పారు.