Sonu Sood : ఆంధ్ర, తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. అంటూ సోనూ సూద్ ఆసక్తికరమైన పోస్టు

రీల్ కంటే కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నారు నటుడు సోనూ సూద్. తెలుగు రాష్ట్రాల్లో ఆయన సేవానిరతిని మెచ్చి అభిమానించేవారున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఉద్దేశించి సోనూ సూద్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Sonu Sood

Sonu Sood : రీల్ నటుడు సోనూ సూద్‌ను ఇప్పుడు ప్రజలు రియల్ హీరోగా ఆరాధిస్తున్నారు. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్లిన ఘన స్వాగతం పలుకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమకు సోనూ సూద్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో ధన్యవాదాలు చెప్పారు.

Deviyani Sharma : నడుము అందాలు ఆరబోస్తూ నటి దేవియని శర్మ..

అడిగిన వారికి లేదనుకుంటా సాయం చేసే నటుడు సోనూ సూద్. రియల్ హీరోగా ప్రజాదరణ సంపాదించుకున్నారు. ముఖ్యంగా కరోనా టైమ్‌లో ఆయన చేసిన సేవలు ఎవరూ మర్చిపోరు. వలస కార్మికులను సొంతింటికి పంపడం.. విదేశాల్లో చిక్కుకున్న వారిని సైతం ఇంటికి చేర్చడం.. ఉద్యోగాల విషయం సాయం చేయడం.. ఇలా ఎవరేది అడిగిన తనవంతు సాయం అందిస్తూ వస్తున్నారు సోనూ సూద్.

Iswarya Menon : చూపులతోనే ఐస్ చేసేస్తున్న ఐశ్వర్య మీనన్ హాట్ పోజులు..

సోనూ సూద్ సేవానిరతిని మెచ్చుకుంటూ అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానులు ఏర్పడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సైతం పలుమందికి సోనూ సూద్ తనవంతు సాయం అందించారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన కోసం గుడులు వెలిశాయి. హారతులు ఇచ్చే భక్తులు కూడా ఉన్నారు. ఆయనను చూడాలని, కలవాలని పాదయాత్రగా ముంబయి వెళ్లిన అభిమానులు ఉన్నారు. రీసెంట్‌గా సోనూ సూద్ ‘తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసారు సోనూ సూద్. పలు సందర్భాల్లో తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ఆయనకు ఇక్కడి వారు ఎంతటి ఘన స్వాగతం పలికారో ఆ వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సోనూసూద్ ప్రస్తుతం  తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ, కన్నడ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.