Subbaraju : పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరంటే?
ఎట్టకేలకు ప్రముఖ నటుడు సుబ్బరాజు ఓ ఇంటివాడు అయ్యాడు.

Actor Subbaraju got married at 47 Pic viral
Subbaraju : ఎట్టకేలకు ప్రముఖ నటుడు సుబ్బరాజు ఓ ఇంటివాడు అయ్యాడు. ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన భార్యతో కలిసి బీచ్ ఒడ్డున దిగిన ఫోటో షేర్ చేశారు. పెళ్లి బట్టల్లో వారిద్దరు చూడ చక్కగా ఉన్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా.. సుబ్బరాజు సతీమణి పేరు, పెళ్లి ఎక్కడ జరిగింది ? వంటి వివరాలు ఏమీ తెలియరాలేదు. గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో పెళ్లి ఎప్పుడు అనే ప్రస్తావన రాగా.. తనకు ఆసక్తి లేదంటూ సుబ్బరాజు చెప్పేవారు. అయితే.. ఎట్టకేలకు 47 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడు అయ్యాడు. ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
Nikhil : సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిని నిఖిల్ కొత్త మూవీ.. రిలీజైన 20 రోజులకే..
కృష్ణ వంశీ దర్శకత్వంలో ఖడ్గం మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సుబ్బరాజు. ఆ మూవీలో ఓ చిన్న పాత్రలో ఆయన కనిపించారు. అయితే.. ఈ అవకాశం అనుకోకుండా సుబ్బరాజుకు వచ్చింది. దర్శకుడు కృష్ణ వంశీ కంప్యూటర్ రిపేర్ కోసం వెళ్లిన ఆయనకు అనుకోకుండా మూవీలో ఛాన్స్ వచ్చింది.
Ukku Satyagraham : గద్దర్ నటించిన చివరి సినిమా.. ‘ఉక్కు సత్యాగ్రహం’ రిలీజ్ డేట్ అనౌన్స్..
ఆ తరువాత తమిళ అమ్మాయి చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆయన ఇక వెనుదిరిగి చూడాల్సి న పని లేకుండా పోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా నటించి అభిమానుల్లో చెదరని ముద్ర వేశారు.
View this post on Instagram