Nikhil : సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిని నిఖిల్ కొత్త మూవీ.. రిలీజైన 20 రోజుల‌కే..

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ న‌టించిన మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.

Nikhil : సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిని నిఖిల్ కొత్త మూవీ.. రిలీజైన 20 రోజుల‌కే..

Nikhil Appudo Ippudo Eppudo movie streaming on Amazon Prime Video

Updated On : November 27, 2024 / 9:02 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ న‌టించిన మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సుదీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. స్వామిరారా, కేశవ వంటి మూవీల త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూడో చిత్రం. భారీ అంచ‌నాల మ‌ధ్య న‌వంబ‌ర్ 8న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఈ చిత్రంలో నిఖిల్ రేస‌గా క‌నిపించాడు. అయితే.. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో అల‌రించ‌లేక‌పోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఎలాంటి అప్‌డేట్ లేకుండానే ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

Ukku Satyagraham : గద్దర్ నటించిన చివరి సినిమా.. ‘ఉక్కు సత్యాగ్రహం’ రిలీజ్ డేట్ అనౌన్స్..

ఈ విష‌యాన్ని అమెజాన్ ప్రైమ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. రిషి, తార‌ల ప్రేమ‌క‌థ‌ను ఎంచ‌క్కా చూసేయండి అంటూ రాసుకొచ్చింది. ఇంకెందుకు ఆల‌స్యం థియేట‌ర్ల‌లో చూడ‌ని వారంతా ఎంచ‌క్కా ఓటీటీలో చూడండి మ‌రి.

Ram Gopal Varma: నేనేమీ భయపడటం లేదు.. వీడియో విడుదల చేసిన ఆర్జీవీ.. సంచలన వ్యాఖ్యలు