Actor Syed Ryan Sohel Sensational Comments on Tollywood Young Heros in BootCut Balaraju Movie Trailer Launch Event
Syed Ryan Sohel : సినీ పరిశ్రమలో ఒక హీరో సినిమాకి ఇంకో హీరో సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ప్రమోషన్స్ లో ఏదో ఒక రకంగా పాల్గొంటారు. కొంతమంది చిన్న హీరోలు, చిన్న సినిమాల ప్రమోషన్స్ కి కూడా సినీ ప్రముఖులు వస్తారు. బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్న సోహైల్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వచ్చిన మిస్టర్ ప్రగ్నెంట్ తప్ప మిగిలినవి ఏవి ఆశించినంత విజయం సాధించలేదు.
ప్రస్తుతం సోహైల్ బూట్‌కట్ బాలరాజు(BootCut Balaraju) అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 2 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు సోహైల్. గత కొన్ని రోజులుగా పలు ఏరియాలు తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నాడు సోహైల్. తాజాగా నిన్న సాయంత్రం బూట్‌కట్ బాలరాజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో సోహైల్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Also Read : Ayodhya Ram Mandir : అయోధ్యలో సూపర్ స్టార్, పవర్ స్టార్.. వీడియోలు వైరల్..
సోహైల్ మాట్లాడుతూ.. సంక్రాంతి టైంలో కొంతమంది సక్సెస్ ఫుల్ యంగ్ హీరోలకి ఫోన్ చేసాను నా సినిమాకు సపోర్ట్ కోసం. లిఫ్ట్ చేసి సోహెల్ అనగానే కట్ చేశారు. మళ్ళీ తర్వాత ఫోన్స్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. నేను చాలా బాధపడ్డాను. కానీ వెంకటేష్ సర్ కి నేను వాట్సాప్ లో మెసేజ్ పెడితే ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు బాగా చేసుకో, కీప్ రాకింగ్ అని. ఆయన స్టార్ హీరో, ఆ స్థాయిలో ఉండి కనీసం రిప్లై ఇచ్చారు. దానికి నేను చాలా సంతోషించాను. నేను పర్సనల్ గా కూడా ఆయన్ని ఎప్పుడు కలవలేదు, అయినా నాకు రిప్లై ఇచ్చారు. అందరికి ఒకటే చెప్తున్నాను ఒక సినిమా హిట్ కొట్టగానే ఎప్పుడు ఎలా ఉందామో అలాగే ఉందాం. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుందాం. ఎవరి దీపం ఎప్పుడు ఆరిపోతుందో తెలీదు, అలాంటి సిట్యువేషన్ లో ఉన్నాం. ఒకటే రిక్వెస్ట్ నా లాంటి యువ హీరోలు సినిమాలు చేసి మీ సపోర్ట్ అడిగితే కనీసం ఒక రిప్లై ఇవ్వండి అని అన్నాడు. దీంతో సోహైల్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. మరి సోహైల్ ని పట్టించుకోని ఆ యువ హీరోలు ఎవరో?