tarak ratna health bulletin
Actor Tarakaratna : నిన్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ కార్యకర్తలతో పాటు సినీ నటులు నందమూరి బాలకృష్ణ, నందమూరి తారకరత్న కూడా కుప్పం చేరుకున్నారు. ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉన్న తారకరత్న పాదయాత్రలో నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే కార్యకర్తలు తారకరత్నని అక్కడి నుంచి కుప్పంలోని హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే పల్స్ పడిపోవడంతో డాక్టర్లు సీపీఆర్ చేసి పల్స్ వచ్చేటట్లు చేశారు.
Actor Tarakaratna Ill : నటుడు తారకరత్నకు అస్వస్థత.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలింపు
తారకరత్న హెల్త్ కండీషన్ ను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. తారకరత్న గుండెలో ఎడమ వైపు వాల్ 90 శాతం బ్లాక్ అయిందని. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు హాస్పిటల్ కి తరలిస్తున్నాము. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. త్వరలోనే అతను కోలుకుంటాడు అని చెప్పాడు. ఇక నిన్న రాత్రి వేళ బాలకృష్ణ దగ్గర ఉండి తారకరత్నని అత్యాధునిక సదుపాయాలు ఉన్న ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరు తీసుకువెళ్లాడు.
బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో ప్రస్తుతం తారకరత్నకు వైద్యం అందిస్తున్నారు. నిన్నటి నుండి హాస్పిటల్ లోనే ఉన్న బాలకృష్ణ.. సిఐసియూలో ఉన్న తారకరత్న హెల్త్ బులెటిన్ ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నాడు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగళూరు హాస్పిటల్ కి బయలుదేరనున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి వీరి ముగ్గురుతో పాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ కి చేరుకోనున్నారు.
కాగా ఇప్పుడే తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్య బృందం. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమం గానే ఉన్నట్లు తెలియజేశారు. ఆయనకి కంటిన్యూ చికత్స ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఐసియూలో ఉన్న తారకరత్నకు ప్రైవసీ అవసరం. కాబట్టి అతనిని చూడడానికి ఎవరకి అనుమతి లేదు అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు హాస్పిటల్ యాజమాన్యం. ఇక ఈ వార్త తెలుసుకున్న నందమూరి, నారా అభిమానులు తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు.