Vennela Kishore look from What The Fish
Vennela Kishore-What the Fish : చాలా గ్యాప్ తరువాత రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్’. ‘మనం మనం బరంపురం’ అనేది ట్యాగ్ లైన్. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 6ix సినిమాస్ బ్యానర్ మీద విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే మనోజ్ ఫస్ట్‌లుక్ ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో వెన్నెల కిశోర్‌కు కు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌లో వెన్నెల కిశోర్ చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు. చేతిలో ఓ పెద్ద రంపంతో కనిపిస్తుండగా, బ్యాగ్రౌండ్‌లో కరెన్సీ నోట్లు గాల్లోకి ఎగురుతున్నాయి.
మంచు మనోజ్, వెన్నెల కిశోర్ లు కాకుండా ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు అన్న వివరాలను చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే వారి వివరాలను వెల్లడించనున్నారు.
My AVATAR in #WhatTheFish ??..Thanks to @afilmbyv ?
Exploding soon on the big screens ?@afilmbyv ?@HeroManoj1 #Varun @6ixCinemas #VishalBezawada #SuryaBezawada #Shaktikanth @prosathish pic.twitter.com/XW8gy38jQj
— vennela kishore (@vennelakishore) October 16, 2023