Vijayendra Prasad : అతి త్వరలో హీరోగా అకీరా నందన్.. రేణు దేశాయ్‌కు రచయిత విజయేంద్ర ప్రసాద్ రిక్వెస్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ ను అతి త్వరలోనే హీరోని చేయాలని రేణు దేశాయ్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కోరారు.

Vijayendra Prasad comments on Akira Nandan
Vijayendra Prasad comments on Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ ను అతి త్వరలోనే హీరోని చేయాలని రేణు దేశాయ్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కోరారు. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజేంద్ర ప్రసాద్ హాజరై మాట్లాడారు.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెకెక్కిన నాయకన్ చిత్రాన్ని చూసినప్పుడు తెలుగులో ఇలాంటి చిత్రాలు ఎప్పుడు వస్తాయా అని అనుకుండేవాడినని ఆ లోటు పుష్ప సినిమా తీర్చిందన్నారు. ఇక టైగర్ నాగేశ్వరరావు చిత్ర ట్రైలర్ తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమా మరో కొత్త లోకానికి తీసుకువెళ్లేలా ఉందన్నారు. ట్రైలర్ చూసిన తరువాత దర్శకుడు వంశీ ఫోన్ నంబర్ కనుక్కుని అతడితో మాట్లాడే వరకు మనసు ఆగలేదన్నారు.
అకీరా నందన్ హీరోగా చేయాలి
ఇక రేణుదేశాయ్ గురించి మాట్లాడుతూ.. మీరు సినిమాలకు దూరమై ఉండొచ్చు గానీ మాకు చాలా దగ్గరగా ఉన్నారన్నారు. అతి త్వరలోనే మీ కుమారుడు అకీరా నందన్‌ను హీరోగా చేయాలని విజయేంద్ర ప్రసాద్ కోరారు. ఆ సినిమాలో మీరు అతడి తల్లిగా నటించాలన్నారు. ఈ మాటలు విన్న రేణుదేశాయ్ ఆనందంతో ఉప్పొంగిపోయింది.
Also Read : మొన్న మెగావారి ఇంట.. నేడు అల్లువారి ఇంట.. వరుణ్-లావణ్య ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్..
అనంతరం హీరో రవితేజని కొనియాడారు. తెలుగు చిత్రం విక్రమార్కుడు చాలా బాషల్లోకి రీమేక్ అయినప్పటికీ ఆయా చిత్రాల్లో నటించిన హీరోలు ఎవ్వరూ కూడా రవితేజను మ్యాచ్ చేయలేకపోయారన్నారు. మన హీరోలు కేవలం తెలుగుకే పరిమితం కావొద్దని భారతదేశ స్థాయిలో జెండా ఎగురవేయాలని కోరారు.
టైగర్ నాగేశ్వరావు సినిమా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై నిర్మించారు. ఈ మూవీలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలను పోషించారు. చాలా కాలం తరువాత రేణు దేశాయ్ ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో రేణు దేశాయ్ హేమలత లవణం అనే ఓ పవర్ ఫుల్ రియల్ క్యారెక్టర్ ని పోషించింది.