Varun Lavanya : మొన్న మెగావారి ఇంట.. నేడు అల్లువారి ఇంట.. వరుణ్-లావణ్య ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్..
మొన్న మెగావారి ఇంట జరిగిన వరుణ్-లావణ్య ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ నేడు అల్లువారి ఇంట జరిగాయి. ఇక ఈ పార్టీలో హీరో నితిన్, హీరోయిన్ రీతూ వర్మ..

Varun Tej Lavanya Tripathi Pre Wedding Celebrations at Allu Family residence photos
Varun Tej – Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి త్వరలో జరగబోతుంది. ఇక ఈ పెళ్లి వేడుక సంబరాలు ఆల్రెడీ మొదలయ్యి సందడి సందడిగా జరుగుతున్నాయి. నిశ్చితార్థం వేడుకను పూర్తి చేసుకున్న ఈ మెగా జంట.. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల చిరంజీవి ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ పార్టీలో చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు, సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్.. ఇలా పవన్ కళ్యాణ్ తప్ప మెగా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా హాజరయ్యారు.
మెగావారి ఇంట జరిగిన ఆ సెలబ్రేషన్స్ లో అల్లు ఫ్యామిలీ నుంచి.. శిరీష్, బన్నీ వారసుడు అయాన్ మాత్రమే హాజరయ్యినట్లు ఫోటోలు చూస్తే అర్ధమయ్యింది. అయితే తాజాగా అల్లువారి ఇంట మరో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ పార్టీలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన వారంతా కనిపిస్తున్నారు. అలాగే ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ కూడా హాజరయ్యారు. హీరో నితిన్, హీరోయిన్ రీతూ వర్మ.. తదితరులు అటెండ్ అయ్యినట్లు తెలుస్తుంది. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను అల్లు శిరీష్ షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Also read : Allu Arjun : నేషనల్ అవార్డు అందుకోవడానికి బయలుదేరిన అల్లు అర్జున్.. పిక్స్ వైరల్..!
A party at home with family & friends celebrating Varun & Lavanya’s upcoming wedding! pic.twitter.com/QiQlrCw8uH
— Allu Sirish (@AlluSirish) October 16, 2023
కాగా ఈ పెళ్లి పనులు అన్ని రామ్ చరణ్ సతీమణి ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పెళ్లి వేడుక ఎక్కడ చోటు చేసుకోబోతుందో అని కూడా ఉపాసన తెలియజేశారు. ఇటలీలోని టుస్కానీ నగరంలో ఈ వివాహం జరగుంది. అయితే పెళ్లి తేదీ పైనే క్లారిటీ రావాల్సి ఉంది. నవంబర్ మొదటి వారంలో ఈ వివాహం జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మెగా కుటుంబం ఈ పెళ్లి తేదీని ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి.