ఫైట్ సీన్ చేస్తుండగా హీరో విశాల్‌కు గాయాలు
దక్షిణాది ప్రముఖ హీరో విశాల్ షూటింగ్లో తీవ్రంగా గాయపడ్డారు. సుందర్.సి దర్శకత్వంలో విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో భాగంగా ఫైట్ సీన్ తీస్తుండగా.. విశాల్ కాలు, చేయి విరిగాయి. ఫైట్ సీన్లను ఎలాంటి డూప్ లేకుండా చేయడం మొదటి నుంచి విశాల్‌కు అలవాటే. ఇదే క్రమంలో కొత్త సినిమా కోసం కూడా అలాగే చేసి విశాల్ గాయాలపాలయ్యాడు. గతంలోనూ ’తుప్పరివాలన్’ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ ఇలాగే చేసి గాయపడ్డాడు. విశాల్‌కు దెబ్బ తగిలి చేతికి కాలుకు కట్లు కట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో విశాల్ అభిమానులు పెట్టి త్వరగా కోలుకోవాలని అంటున్నారు. అయితే టర్కీలో సుమారు 50 రోజుల పాటు షూటింగ్ జరగవలిసి ఉండగా.. షూటింగ్ కొనసాగిస్తారా? లేదా? అనేది తెలియట్లేదు.
ఇక విశాల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఇటీవల నిశ్చితార్ధం కూడా అయింది. మరోవైపు విశాల్ హీరోగా ఎన్టీఆర్ నటించిన టెంపర్ రీమేక్.. ‘అయోగ్య’ మే 10న విడుదల కాబోతుంది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. విశాల్‌కు జోడీగా రాశీ ఖన్నా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించినా విడుదలను వాయిదా వేసినట్లు మళ్లీ ప్రకటించారు.