Viswant Duddumpudi : యువ హీరో విశ్వంత్ కేరింత సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. కానీ ఆ తర్వాత అనుకున్నంత స్టార్ డమ్ రాలేదు. అయినా సినీ పరిశ్రమలోనే ఉంటూ చిన్న సినిమాల్లో హీరోగా, పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు. మనమంతా, జెర్సీ, ఓ పిట్ట కథ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, కథ వెనక కథ, హైడ్ అండ్ సీక్.. ఇలా పలు సినిమాల్లో నటించాడు విశ్వంత్.
Also Read : Rana Wife : కర్వాచౌత్ పండుగ.. రానా భార్య మిహీక స్పెషల్ పోస్ట్.. అదే చంద్రుడి కింద అంటూ..
విశ్వంత్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో.. రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ లో కలిసి నటిస్తున్నాను అని తనే ఈ విషయం చెప్పాడు. అయితే తాజాగా విశ్వంత్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.
ప్రామిస్ ఫర్ లైఫ్ టైం అంటూ భావన అనే అమ్మాయితో ఉన్న ఫొటోలు షేర్ చేసాడు విశ్వంత్.
అయితే ఇవి పెళ్లి ఫొటోలు కాకపోయినా నిశ్చితార్థం లేదా రిసెప్షన్ ఫొటోలు అని భావిస్తున్నారు.
పలువురు విశ్వంత్ కి నిశ్చితార్థం, పెళ్లి ఆల్రెడీ అయిపొయింది. ఫొటోలు మాత్రం ఇప్పుడు ఇవి షేర్ చేసారు అని అంటున్నారు.
అయితే ఇవి ఏ ఫొటోలు అయినా తన భార్య భావనని అందరికి పరిచయం చేస్తూ ఫొటోలు షేర్ చేయడంతో విశ్వంత్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.