Actress Aparna Balamurali : ఒక మహిళతో ప్రవర్తించేది ఇలానేనా? కాలేజీ విద్యార్థి అసభ్య ప్రవర్తనపై స్పందించిన హీరోయిన్
బలవంతంగా నా చేయి పట్టుకుని కుర్చీలో నుంచి పైకి లేపడం సరికాదు. నా భుజాలపై అతడు చేతులు వేసేందుకు ప్రయత్నించాడు. ఒక మహిళతో అతడు ప్రవర్తించాల్సిన పద్ధతి ఇది కాదు.

Actress Aparna Balamurali : కేరళ ఎర్నాకుళంలో ఓ విద్యార్థి.. హీరోయిన్ అపర్ణా బాలమురళీతో అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ విద్యార్థి ప్రవర్తన పట్ల అంతా తీవ్రంగా మండిపడుతున్నారు. చాలా ఓవర్ చేశాడని ఫైర్ అవుతున్నారు. కాగా, ఈ ఘటనపై హీరోయిన్ అపర్ణా స్పందించారు.
”ఆ ఘటన నన్ను చాలా బాధించింది. లా చదువుతున్న విద్యార్థి.. ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం నేరం అన్న విషయం తెలియదా? బలవంతంగా నా చేయి పట్టుకుని కుర్చీలో నుంచి పైకి లేపడం సరికాదు. నా భుజాలపై అతడు చేతులు వేసేందుకు ప్రయత్నించాడు. ఒక మహిళతో అతడు ప్రవర్తించాల్సిన పద్ధతి ఇది కాదు. ఈ ఘటనపై నేను ఫిర్యాదు చేయదల్చుకోలేదు. ఫిర్యాదు చేసి దాని వెనుక పరిగెత్తే సమయం నాకు లేదు. కానీ, అతడి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని హీరోయిన్ అపర్ణా బాలమురళీ వాపోయారు.
Also Read..Kerala: కాలేజీలో హీరోయిన్‌తో విద్యార్థి అసభ్య ప్రవర్తన.. సస్పెండ్ చేసిన యాజమాన్యం
కాగా, ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో కాలేజీ యాజమాన్యం సీరియస్ అయ్యింది. హీరోయిన్ తో అనుచితంగా ప్రవర్తించిన ఆకతాయి విద్యార్థిపై చర్యలు తీసుకుంది. వారం రోజుల పాటు కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. అలాగే, కాలేజీ యాజమాన్యం.. హీరోయిన్ కు క్షమాపణలు చెబుతూ ఓ లేఖను విడుదల చేసింది. ‘‘లా కాలేజీ ఈవెంట్‌లో నటికి వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఘటన దురదృష్టకరమైనది. ఈ ఘటన జరిగినప్పుడు యూనియన్ తరఫున ఓ వ్యక్తి క్షమాపణలు కోరాడు. ఆమెకు ఎదురైన ఇబ్బందికర ఘటనకు క్షమాపణలు చెబుతున్నాం. ఇటువంటి ఘటనను యూనియన్ తీవ్రంగా పరిగణిస్తుంది’’ అని లా కాలేజీ యూనియన్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
Also Read..Unstoppable 2: అన్‌స్టాపబుల్ ‘పవర్’ టీజర్.. లాస్ట్ సినిమా అంటూ బాంబ్ పేల్చిన పవన్!
అసలేం జరిగిందంటే..
అపర్ణా బాల మురళీ, కో స్టార్ వినీత్ శ్రీనివాసన్ తో కలసి ‘తన్కమ్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ లా కాలేజీని సందర్శించింది. ఆమె స్టేజ్‌పై ఉండగా ఓ విద్యార్థి స్టే జ్ ఎక్కాడు. అపర్ణకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. అంతటితో ఆగలేదు. నిల్చొమని ఆమెను బలవంతం చేశాడు. ఆ తర్వాత మరింత ఓవర్ చేశాడు. ఆమె భుజంపై చేయి వేయడానికి ప్రయత్నించాడు. యువకుడి ప్రవర్తనతో హీరోయిన్ అపర్ణ కంగుతింది. వెంటనే తేరుకుని అతడి నుంచి దూరంగా జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరోయిన్ పట్ల ఆకతాయి వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఆ ఆకతాయిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.