Shobha Shetty
Shobha Shetty : కార్తీక దీపం, బిగ్ బాస్ ఫేమ్ నటి శోభా శెట్టి ప్రస్తుతం కన్నడలో సీరియల్, తెలుగులో పలు షోలు చేస్తూ బిజీగానే ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తాను ఇండస్ట్రీకి ఎలా వచ్చిందో చెప్పింది.
శోభా శెట్టి తన ప్రయాణం గురించి చెప్తూ.. నేను ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే ఫ్యాషన్ డిజైనర్ అయ్యేదాన్ని. కాలేజీలో చదువుతున్నప్పుడు కాలేజీలో ఓ ఈవెంట్ జరిగేటప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి నన్ను చూసారు. నేను చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని. నన్ను చూసి సీరియల్స్ లో ట్రై చేయొచ్చు కదా అన్నారు. తన మేనేజర్ నా నంబర్ తీసుకున్నారు. తర్వాత కాల్ చేసి ఆడిషన్ కి రమ్మన్నారు. మా అమ్మకి చెప్తే వెల్దాము, ట్రై చేద్దాం అన్నారు. ఫొటోలు తీసుకొని రమ్మంటే కాలేజీ పాస్ పోర్ట్ ఫొటోలు తీసుకెళ్ళాను, అవి చూసి నవ్వారు. మాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం అన్నాను. తర్వాత వాళ్ళే పిలిచి ఫోటోషూట్ చేసారు. కన్నడ సీరియల్ లో ఏకంగా హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. అప్పుడు రోజుకు 750 రూపాయలు ఇచ్చారు అని తెలిపింది.
Also Read : NagaVamsi : ఇండస్ట్రీ బాగోలేదు.. మీరు వచ్చి హిట్ ఇవ్వండి.. కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగవంశీ స్పీచ్..