Shobha Shetty : తన లవ్ స్టోరీ గురించి చెప్పిన బిగ్ బాస్ భామ.. పెళ్లి ఎప్పుడంటే? ఒప్పుకోకపోతే అతని వెనక తిరిగా..

తాజాగా శోభా శెట్టి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది.

Shobha Shetty : తన లవ్ స్టోరీ గురించి చెప్పిన బిగ్ బాస్ భామ.. పెళ్లి ఎప్పుడంటే? ఒప్పుకోకపోతే అతని వెనక తిరిగా..

Shobha Shetty

Updated On : July 27, 2025 / 9:02 AM IST

Shobha Shetty : కన్నడ భామ శోభా శెట్టి కన్నడ, తెలుగు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకోగా తెలుగులో కార్తీక దీపం సీరియల్ లో మోనిత అనే నెగిటివ్ పాత్రలో బాగా ఫేమ్ తెచ్చుకుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని మరింత వైరల్ అయింది. శోభా శెట్టి ఆల్రెడీ యశ్వంత్ అనే సీరియల్ నటుడ్ని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకుంది.

తాజాగా శోభా శెట్టి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది.

Also Read : Rekha – Uday Kiran : నాతో పాటు ఉదయ్ కిరణ్ ఆ సూపర్ హిట్ సినిమా చేయాలి కానీ.. మా ఇద్దరి కాంబోలో రెండు సినిమాలు మిస్..

శోభా శెట్టి మాట్లాడుతూ.. నా అన్ని సమస్యలు తీరిపోయి సెటిల్ అయ్యాను. కష్టాలు అయిపోయాయి అనుకున్నాక ఇంట్లో పెళ్ళిసంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నేను రాఘవేంద్ర స్వామిని బాగా నమ్ముతాను. సంబంధాలు చూడటం మొదలుపెట్టాక మంత్రాలయం వెళ్లి దండం పెట్టుకున్నా. నువ్వు ఎవర్ని చూపిస్తే వాళ్లనే చేసుకుంటాను అని రాఘవేంద్ర స్వామికి చెప్పాను. అక్కడి నుంచి వచ్చాక ఓ 20 రోజుల గ్యాప్ లో షూటింగ్ షెడ్యూల్ లో యశ్వంత్ ని క్యాజువల్ గా చూసా. అతను కూడా చూసాడు. అలా రెండు మూడు సార్లు చూసుకున్నాం. అప్పటికే చాలా రోజుల నుంచి కలిసి పనిచేస్తున్నాం కానీ స్పెషల్ ఏమి లేదు. ఆ రోజు చూసాక నాకు ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేసాడు ఎందుకు చూసావు అని. అలా మాట్లాడటం మొదలయి ప్రేమలో పడ్డాను.

యశ్వంత్ ని దేవుడే ఇచ్చాడని నమ్మాను. 5 ఏళ్ళు లవ్ మాది. నేనే మొదట ప్రపోజ్ చేశా. అతను ఒప్పుకోలేదు. లైఫ్ లో సెటిల్ అవ్వలేదని, ఇంకా ఏవో కారణాలు చెప్పి నా ప్రేమని ఒప్పుకోలేదు. కానీ నేను అతని వెనక తిరిగా. కొన్నాళ్ళకు ఒప్పుకున్నాడు. మా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈ ఇయర్ ఫిబ్రవరి, మార్చ్ లో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. కానీ మా అమ్మకు హెల్త్ బాగోలేదు. మా అమ్మకు నా పెళ్లి గ్రాండ్ గా చేయాలని కల. మా అమ్మ హెల్త్ సెట్ అయ్యాక పెళ్లి చేసుకుంటాము. ఈ ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ మొదట్లో చేసుకుంటాము అని తెలిపింది.

Also Read : Shobha Shetty – Sudeep : శోభా శెట్టికి కన్నడ స్టార్ హీరో సుదీప్ కు ఉన్న వివాదం ఏంటి? క్లారిటీ ఇచ్చిన శోభా శెట్టి..