Shobha Shetty – Sudeep : శోభా శెట్టికి కన్నడ స్టార్ హీరో సుదీప్ కు ఉన్న వివాదం ఏంటి? క్లారిటీ ఇచ్చిన శోభా శెట్టి..

కన్నడ బిగ్ బాస్ హోస్ట్ హీరో సుదీప్ తో శోభా శెట్టి షోలో గొడవ పెట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ గొడవ గురించి క్లారిటీ ఇచ్చింది.

Shobha Shetty – Sudeep : శోభా శెట్టికి కన్నడ స్టార్ హీరో సుదీప్ కు ఉన్న వివాదం ఏంటి? క్లారిటీ ఇచ్చిన శోభా శెట్టి..

Shobha Shetty - Sudeep

Updated On : July 27, 2025 / 8:31 AM IST

Shobha Shetty – Sudeep : కన్నడ భామ శోభా శెట్టి కన్నడ, తెలుగు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకుంది. తెలుగులో కార్తీక దీపం సీరియల్ లో మోనిత అనే నెగిటివ్ పాత్రలో నటించి బాగా వైరల్ అయింది. అనంతరం తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొని మరింత వైరల్ అయింది. అయితే తెలుగు బిగ్ బాస్ తర్వాత కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 లో కూడా పాల్గొంది.

కన్నడ బిగ్ బాస్ హోస్ట్ హీరో సుదీప్ తో శోభా శెట్టి షోలో గొడవ పెట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ గొడవ గురించి క్లారిటీ ఇచ్చింది.

Also Read : Kingdom Trailer : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చేసింది.. అన్నదమ్ముల ఫైట్..

శోభా శెట్టి మాట్లాడుతూ.. కన్నడ బిగ్ బాస్ ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఆల్రెడీ తెలుగు చేశాను కదా అని ఒప్పుకోలేదు. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అడిగారు. అప్పుడు కన్నడలో నాకు ఆఫర్స్ కొంచెం తగ్గాయి, నేను ఖాళీ అయ్యాను, ఒప్పుకుంటే బెటర్ అని ఓకే చెప్పాను. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత రెండు వారాలకు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. నేనే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని వచ్చేసాను. చాలా అగ్రిమెంట్స్ ఉంటాయి ఆ షోకి. నేను టాప్ 2లో ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాను అని గొడవ పడ్డారు.

అప్పుడు సుదీప్ సర్ కన్నడలో కంబ్యాక్ ఇస్తారు అని వచ్చారు, మీకు ఓట్ చేసిన ప్రేక్షకుల గురించి ఆలోచించకుండా మీరు వెళ్ళిపోతారా అని ఫైర్ అయ్యారు. నేను ఇవన్నీ ఓకే కానీ నాకు హెల్త్ ఇంపార్టెంట్. డబ్బులు, ఫేమ్ తర్వాత అయినా వస్తది కానీ నాకు హెల్త్ ఇంపార్టెంట్. నా వల్ల కాదు అనిపించినప్పుడే నేను వెళ్ళిపోతాను అన్నాను. బిగ్ బాస్ టీమ్ కూడా వచ్చి మాట్లాడారు అయినా నేను ఒప్పుకోలేదు. నేను ఫిజికల్, మెంటల్ గా స్ట్రాంగ్ గా లేను. అక్కడ ఆడాలి అంటే స్ట్రాంగ్ గా ఉండాలి. సర్ చెప్పింది కరెక్ట్. కానీ నా ఇబ్బందులు నాకు ఉన్నాయి. అందుకే షో నుంచి బయటకు వెళ్లిపోవడానికి సుదీప్ సర్ తో గొడవ పడ్డాను. బయటకు వచ్చాక చాలా బాధపడ్డాను ఈ విషయంలో. అప్పుడు యశ్వంత్(కాబోయే భర్త) నన్ను స్ట్రాంగ్ చేసాడు అని తెలిపింది.

Also Read : NagaVamsi : ఇండస్ట్రీ బాగోలేదు.. మీరు వచ్చి హిట్ ఇవ్వండి.. కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగవంశీ స్పీచ్..