NagaVamsi : ఇండస్ట్రీ బాగోలేదు.. మీరు వచ్చి హిట్ ఇవ్వండి.. కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగవంశీ స్పీచ్..
కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగవంశీ మాట్లాడుతూ..

NagaVamsi
NagaVamsi : సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – భాగ్యశ్రీ భోర్సే జంటగా తెరకెక్కుతున్న సినిమా కింగ్డమ్. సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జులై 31న కింగ్డమ్ సినిమా రిలీజ్ కాబోతుంది. నేడు తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్ కి నిర్మాత నాగవంశీ కూడా హాజరయ్యారు. గత కొన్నాళ్లుగా థియేటర్స్ కి జనాలు రావట్లేదు, కలెక్షన్స్ రావట్లేదు అనే చర్చ టాలీవుడ్ లో బాగా జరుగుతుంది. ఇటీవల నాగవంశీ ఇంటర్వ్యూలలో కూడా దీని గురించి మాట్లాడారు. తాజాగా కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగవంశీ సినిమాతో పాటు దీనిపై కూడా మాట్లాడారు.
Also Read : Vijay Deverakonda : నన్ను ఎవ్వడూ ఆపేదేలే.. తిరుపతి యాసలో స్పీచ్ అదరగొట్టిన విజయ్ దేవరకొండ..
నాగవంశీ మాట్లాడుతూ.. జెర్సీ అయ్యాక 5 ఏళ్లుగా గౌతమ్ ఇదే కథ మీద ఉన్నాడు. తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త యాక్షన్ గ్యాంగ్ స్టార్ సినిమా చూపిస్తాం. మంచి ఓపెనింగ్స్ ఇస్తారని ఆశిస్తున్నా. మీ రౌడీ బాయ్ లో ఏం మిస్ అయ్యారో గత సినిమాల్లో ఈ సినిమాలో అదే ఉంటుంది. అర్జున్ రెడ్డి ఇంటెన్స్ ఈ సినిమాలో ఉంటుంది. నేను, గౌతమ్ విజయ్ కి హిట్ ఇవ్వాలి అని అనుకున్నాము. ఇండస్ట్రీ మీరు అనుకున్నంత బాగోలేదు. థియేటర్స్ కి రండి. మీరు ఎక్కువగా వచ్చి సినిమాలు చూస్తేనే మేము ఇంకా మంచి సినిమాలు చేస్తాం. ఈ సినిమాని హిట్ చేసి మాకు ఒక ఊపు ఇస్తారని అనుకుంటున్నాము అని అన్నారు.
Also See : Samantha : సమంత లేటెస్ట్ ఫొటోలు.. చీరకట్టులో..