Rekha – Uday Kiran : నాతో పాటు ఉదయ్ కిరణ్ ఆ సూపర్ హిట్ సినిమా చేయాలి కానీ.. మా ఇద్దరి కాంబోలో రెండు సినిమాలు మిస్..
ఇప్పుడు రేఖ రీ ఎంట్రీ ఇస్తాను అంటూ ముందుకొచ్చింది.

Rekha - Uday Kiran
Rekha – Uday Kiran : సినీ పరిశ్రమలో ఒకరు చేయాల్సిన సినిమా ఇంకొకరికి పలు కారణాలతో వెళ్లిపోతుంటుంది. ఇది అందరు నటీనటులకు ఏదో ఒక సినిమా విషయంలో జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఆనందం ఫేమ్ రేఖ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆసక్తికర విషయాలు తెలిపింది.
ఆనందం, ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన రేఖ వేదవ్యాస్ తర్వాత సినిమాలకు దూరమయింది. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో కొన్నేళ్లు దూరంగా ఉంది. ఇప్పుడు రేఖ రీ ఎంట్రీ ఇస్తాను అంటూ ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూలో రేఖ మాట్లాడుతూ.. ఆనందం సినిమా నేను, ఉదయ్ కిరణ్ చేయాలి. లుక్ టెస్ట్ నాకు అతనికి కలిపి చేసారు. నేను ఆ ఒక్కసారే ఉదయ్ కిరణ్ ని కలిసాను. తర్వాత ఏమైందో తెలీదు ఉదయ్ కిరణ్ ప్లేస్ లో ఆకాష్ ని తీసుకున్నారు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తో కలుసుకోవాలని సినిమా ఛాన్స్ వచ్చింది. కానీ నాకు కన్నడలో సినిమాల వల్ల డేట్స్ కుదరక ఆ ఛాన్స్ వదులుకున్నా. ఆ విషయంలో బాధపడ్డాను, డేట్స్ అడ్జస్ట్ చేసి చేస్తే బాగుండు అనుకున్నాను అని తెలిపింది.