Debina Bonnerjee : బుల్లితెర నటికి అరుదైన వైరస్.. ముందు పట్టించుకోలేదు.. ఇప్పుడేమో..

దెబినా బొనర్జీ ఇటీవల తన భర్త, పిల్లలతో కలిసి శ్రీలంక టూర్ కి వెళ్లి వచ్చింది. శ్రీలంక నుంచి వచ్చాక ఆమెకు జలుబు, జ్వరం వచ్చాయి. చిన్నవే కదా అని కొన్ని రోజులు సాధారణ ట్యాబ్లేట్స్ వాడింది. అయినా తగ్గకపోవడంతో.............

Debina Bonnerjee : బుల్లితెర నటికి అరుదైన వైరస్.. ముందు పట్టించుకోలేదు.. ఇప్పుడేమో..

Actress Debina Bonnerjee effected with Influenza B virus

Updated On : March 2, 2023 / 9:35 AM IST

Debina Bonnerjee :  బాలీవుడ్ నటి దెబినా బొనర్జీ పలు తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించింది. అనంతరం బాలీవుడ్ లో సీరియల్స్ చేస్తూ సీరియల్ నటిగా సెటిల్ అయిపోయింది. తెలుగులో కూడా అమ్మాయిలు అబ్బాయిలు, సిక్స్ అనే రెండు సినిమాలు చేసింది ఈ బెంగాలీ భామ. బాలీవుడ్ నటుడు గుర్మీత్ కౌర్ ని వివాహం చేసుకుంది దెబినా బొనర్జీ. ఇటీవల సంవత్సరం గ్యాప్ లో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చి తల్లయింది దెబినా. ప్రస్తుతం కొన్ని టీవీ షోలలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఫ్యామిలీతో కలిసి సరదాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.

దెబినా బొనర్జీ ఇటీవల తన భర్త, పిల్లలతో కలిసి శ్రీలంక టూర్ కి వెళ్లి వచ్చింది. శ్రీలంక నుంచి వచ్చాక ఆమెకు జలుబు, జ్వరం వచ్చాయి. చిన్నవే కదా అని కొన్ని రోజులు సాధారణ ట్యాబ్లేట్స్ వాడింది. అయినా తగ్గకపోవడంతో అనుమానం వచ్చి చెకప్ చేయించుకోగా తనకు ఇన్‌ఫ్లుఎంజా బి వైరస్‌ సోకినట్లు తెలిసింది. ఈ వైరస్ సోకినా వాళ్ళు పిల్లలకు దూరంగా ఉండాలట. తన సోషల్ మీడియాలో మెడికల్ రిపోర్ట్స్ పెట్టి తనకు ఇన్‌ఫ్లుఎంజా బి వైరస్‌ సోకింది, పిల్లలకు దూరంగా ఉండాలట, తల్లిగా కష్టమే కానీ తప్పదు అని పోస్ట్ చేసింది.

Allu Arjun : పుష్ప 2కి బ్రేక్.. ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ..

ప్రస్తుతం డాక్టర్లు ఇచ్చిన ట్యాబ్లేట్స్ తీసుకుంటూ ఇంటివద్దే ఒక రూమ్ లో సపరేట్ గా ఉంటూ చికిత్స తీసుకుంటుందంట దెబినా బొనర్జీ. ఆమె పిల్లలు చాలా చిన్నవాళ్లు అవ్వడంతో పాపం అనుకుంటున్నారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని, తన పిల్లల దగ్గరికి త్వరగా వెళ్లాలని పలువురు ప్రముఖులు, నెటిజన్లు కోరుతూ సోషల్ మీడియాలో కామెంట్స్, పోస్టులు చేస్తున్నారు.